మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రివ్యూ..

ఇంకా ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు.. నాని ప‌డిన క‌ష్టం.. దిల్ రాజు ఆరు బంతుల క‌ల‌.. వేణు శ్రీ‌రామ్ ఐదేళ్ల ఎదురుచూపులు.. సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌.. ఇలా అన్నీ ఇంకా ఒక్క‌రోజులో తేలిపోనున్నాయి. వీళ్లంతా క‌లిసి చేసిన ఎంసిఏ మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం భారీగా విడుద‌ల కానుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాని రేంజ్ మారిపోయేలా 850 థియేట‌ర్స్ లో ఎంసిఏ రానుంది. ఓవ‌ర్సీస్ లోనూ నాని దూకుడు ఓ రేంజ్ లో ఉంది. అక్క‌డ 150 లొకేష‌న్స్ లో వ‌స్తుంది ఈ చిత్రం. దాదాపు 220 స్క్రీన్స్ ఇచ్చారు. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా వ‌చ్చింది. సినిమా ఫ‌స్టాఫ్ అంతా నాని త‌న స్టైల్ ఆఫ్ కామెడీతో లీడ్ చేస్తాడు. పైగా నాని, సాయిప‌ల్ల‌వితో పాటు నాని, భూమిక మ‌ధ్య వ‌చ్చే వ‌దినా, మ‌రిదిల స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా వ‌ర్క‌వుట్ అయ్యాయంటున్నారు. దీనికితోడు ఇంట‌ర్వెల్ ట్విస్ట్ నుంచి సినిమా మ‌రో రేంజ్ కు వెళ్ల‌డం ఖాయం అంటున్నారు సెన్సార్ స‌భ్యులు.
ఇక సెకండాఫ్ అంతా ఎమోష‌న్స్ పై క‌థ న‌డుస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నేనులోక‌ల్.. నిన్నుకోరితో ఇప్ప‌టికే రెండు భారీ హిట్లు అందుకున్నాడు నాని. ఓవ‌ర్సీస్ లోనూ ఈ సినిమాలు రెండూ మిలియ‌న్ మార్క్ దాటాడు. ఇక ఇప్పుడు మూడో హిట్ కు రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన 150 లొకేష‌న్స్ ను ఇప్పుడు నాని కూడా అందుకున్నాడు. అంటే ఈ లెక్క‌న నాని కూడా స్టార్ అయిపోయాడ‌న్న‌మాట‌. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఎమోష‌న్స్ ను ప‌క్కాగా క్యారీ చేస్తూ వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. దిల్ రాజు నిర్మాత‌. డిసెంబ‌ర్ 21న‌ ఎంసిఏ విడుద‌ల కానుంది. ఎంసిఏ ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ఈ బిజినెస్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. ఎంసిఏ కానీ హిట్టైతే నాని రేంజ్ పక్కాగా 50 కోట్ల‌కు చేర‌డం ఖాయం. ఇదే జ‌రిగితే ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల సీట్ల‌కు నాని ఎర్త్ పెట్ట‌డం కూడా ఖాయం. చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here