ముందు జీవిత‌.. ఇప్పుడు నాగ‌బాబు..


ఇండ‌స్ట్రీ క‌దులుతుంది.. క్యాస్టింగ్ కౌచ్ అంటూ మొద‌లుపెట్టి.. ఎవ‌డి ప‌ర్స‌న‌ల్ ఇష్యూను ఇక్క‌డ హైలైట్ చేసుకుంటున్నారు. అడ్డొచ్చిన ఇండ‌స్ట్రీని అడ్డంగా తిట్టేస్తున్నారు. అస‌లు ఇంత జ‌రుగుతున్నా ఇండ‌స్ట్రీలో పెద్ద‌లు ఎందుకు బ‌య‌టికి రావ‌డం లేద‌ని అంతా అనుకుంటున్న త‌రుణంలో ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు.
నిన్న‌టికి నిన్న జీవిత వ‌చ్చి ఇండ‌స్ట్రీని ఎవ‌డైనా ఏదైనా అంటే తాట తీస్తాం అంటూ చెప్పింది. ఇక ఇప్పుడు నాగ‌బాబు వ‌చ్చాడు. ఈయ‌న కూడా చాలా సీరియ‌స్ గానే వార్నింగ్ ఇచ్చాడు. మీడియాను కూడా ఏకి పారేసాడు. టిఆర్పీ రేటింగ్స్ కోసం ప‌క్కోడి ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను కూడా వాడుకోవ‌ద్ద‌ని చెప్పాడు మెగాబ్ర‌ద‌ర్.
ఈ ఇష్యూలో అస‌లు ప‌వ‌న్ కు సంబంధం ఏంటి..? ప‌్ర‌తీ విష‌యంలోనూ ప‌వ‌ర్ స్టార్ ని ఎందుకు తీసుకొస్తున్నార‌ని అడుగుతున్నాడు నాగ‌బాబు. ఏ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వ‌మ‌న‌డం త‌ప్పా..? మ‌రి ఎక్క‌డికి వెళ్తే న్యాయం జ‌రుగుతుంది..? క‌నీసం ఆలోచించ‌రా..?
త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఊరుకోం అన్నాడు నాగ‌బాబు. తాము సైలెంట్ గా ఉన్నామంటే భ‌రిస్తున్నాం అని అర్థం.. చేత‌కానివాళ్లం కాద‌ని చెప్పాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఇప్ప‌ట్నుంచైనా రేటింగ్స్ కోసం చెత్త డిస్క‌ష‌న్లు ఆపాలంటూ మీడియాను కోరాడు నాగ‌బాబు. మ‌రి ఈ మీడియా మారుతుందా..? ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను క‌నీసం ప‌ట్టించుకుంటుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here