మెగాస్టార్ గెట‌ప్ మార్చేసాడుగా..!


చిరంజీవి మ‌ళ్లీ గెట‌ప్ మార్చేసాడు. నిన్న‌టి వ‌ర‌కు ఈయ‌న గుబురు గ‌డ్డం.. కోర‌మీసంతో క‌నిపించాడు. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ఇదే లుక్ తో క‌నిపించాడు చిరంజీవి. కానీ ఇప్పుడు సైరా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. తొలి షెడ్యూల్ త‌ర్వాత ఇంటికే ప‌రిమితం అయ్యాడు చిరంజీవి. దాంతో కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు చిరు. ఇంటి ద‌గ్గ‌ర ఫ్యాన్స్ ను న్యూ ఇయ‌ర్ సందర్భంగా క‌లిసిన అన్న‌య్య‌.. గ‌డ్డం తీసేసి ఫ్రెష్ లుక్ లో క‌నిపించాడు. కోర‌మీసాలు కూడా లేవు. సైరా రెండో షెడ్యూల్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. దాంతో అప్ప‌టి వ‌ర‌కు ఇదే లుక్ లో ఉండ‌బోతున్నాడు చిరంజీవి. ఉయ్యాలవాడ పాత్ర కోసం త‌న‌ను తాను చాలా మార్చుకున్నాడు మెగాస్టార్. ఈ మ‌ధ్యే జీ గోల్డెన్ అవార్డ్స్ ఈవెంట్ కు వ‌చ్చిన చిరంజీవి.. త‌న లుక్ తో మెస్మ‌రైజ్ చేసాడు. కోర‌మీసాల‌తో కేక పెట్టించాడు. సైరా లుక్ విష‌యంలో దాచుకోడానికి ఏమీ లేద‌ని చెప్పేస్తున్నాడు చిరంజీవి. ఇక ఇప్పుడు కొత్త లుక్ లోనూ ప‌దేళ్ల కింది చిరంజీవిని గుర్తు చేస్తున్నాడు మెగాస్టార్.
మెగాస్టార్ మెగా లుక్ చూసి అక్క‌డున్న వాళ్లే కాదు.. అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. 63 ఏళ్ల వ‌య‌సులోనూ ఓ సినిమా కోసం చిరంజీవి ప‌డుతున్న శ్ర‌మ చూసి కుర్ర హీరోలు చాలా నేర్చుకుంటున్నారు. ఈ పాత్ర కోసం అహ‌ర్నిష‌లు క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరు. అంతేకాదు.. యుద్ధవిద్య‌లు.. గుర్ర‌పుస్వారీ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు చిరంజీవి. వీటితోపాటు క‌త్తిసాములోనూ ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. మొత్తానికి 60 ఏళ్లు దాటిన త‌ర్వాత యోధుడిగా మార‌డానికి కంటిమీద కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరు. మ‌రి ఈ క‌ష్టానికి ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here