మెగా కంపౌండ్ లోనే హ‌రీష్ శంక‌ర్..!

హ‌రీష్ శంక‌ర్.. ఈ పేరుకు తెలుగులో ఓ క్రేజ్ ఉంది. ప‌న్నెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆక‌లి తీర్చిన ద‌ర్శ‌కుడిగా ఈయ‌న‌కు గుర్తింపు ఉంది. గ‌బ్బ‌ర్ సింగ్ తో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు హ‌రీష్. ఆ త‌ర్వాత కూడా వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకున్నాడు. ముఖ్యంగా మెగా హీరోల‌కు ఈ ద‌ర్శ‌కుడు బాగానే క‌లిసొచ్చాడు. మిర‌ప‌కాయ్ త‌ర్వాత ప‌వ‌న్ కు గ‌బ్బ‌ర్ సింగ్ ఇచ్చాడు.. ఆ త‌ర్వాత సాయిధ‌రంతేజ్ కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇచ్చి క్రేజ్ పెంచేసాడు.

ఇక ఆ త‌ర్వాత అల్లుఅర్జున్ తో దువ్వాడ జ‌గ‌న్నాథమ్ చేసాడు. ఈ చిత్రం హిట్ కాక‌పోయినా 70 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. క‌మ‌ర్షియల్ డైరెక్ట‌ర్ గా హ‌రీష్ శంక‌ర్ కు తిరుగులేదు. ఒక్క సినిమాతో ఇమేజ్ మార్చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. ఈ విష‌యం తెలిసే ఇప్పుడు అల్లుడి కోసం ఈయ‌న్ని లైన్ లో పెడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అన్నీ కుదిర్తే క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమాకు హ‌రీష్ ద‌ర్శ‌కుడు అని తెలుస్తుంది.

ఇప్ప‌టికే క‌థ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం విజేత విడుద‌ల ప‌నుల్లో బిజీగా ఉన్నాడు క‌ళ్యాణ్. ఇది విడుద‌లైన త‌ర్వాత హ‌రీష్‌-క‌ళ్యాణ్ సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. మొత్తానికి మెగా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే క‌ళ్యాణ్ కు కూడా హ‌రీష్ బాగానే క‌లిసొస్తాడు మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here