మెగా ఫ్యాన్స్ లో విడిపోయార‌న్న బ‌న్నీ..


రాజ‌కీయ నాయ‌కుల‌పై బ‌న్నీ సెటైర్..  చాలా రోజులుగా ఇండ‌స్ట్రీతో పాటు బ‌య‌ట కూడా వినిపిస్తున్న మాట ఇదే. మెగా ఫ్యాన్స్ లో చాలా మంది హీరోల‌కు అభిమానులు ఉన్నారు. ఒక్క హీరోనే అభిమానిస్తూ.. మిగిలిన వాళ్ల‌ను అభిమానించ‌ని అభిమానులు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అంతా ప‌వ‌న్ కు కూడా అబిమానులు కావాల్సిన అవ‌స‌రం లేదు. అలాగ‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా చిరు ఫ్యాన్స్ కాదు. చ‌ర‌ణ్ ఫ్యాన్స్ అంతా బ‌న్నీకి కాదు.. అలాగే బ‌న్నీ ఫ్యాన్స్ అంతా చ‌ర‌ణ్ కు కాదు.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రికి ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంది. దీనిపై చాలా కాలంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప‌వ‌న్, చిరు, చ‌ర‌ణ్ సంగ‌తి ఎలా ఉన్నా.. బ‌న్నీ ఫ్యాన్ బేస్ పైనే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మెగాఫ్యామిలీ కాకుండా త‌న‌కంటూ సొంత‌కుంప‌టి పెట్టుకోడానికి చాలా కాలంగా చూస్తున్నాడు బ‌న్నీ. ఈ క్ర‌మంలోనే ఆస‌క్తిక‌ర‌మైన క‌మెంట్స్ చేసాడు బ‌న్నీ. మెగా ఫ్యామిలీలో అర‌డ‌జ‌న్ మంది హీరోలు ఉన్నామ‌ని.. ఇందులో ఏ ఒక్క‌రు ఒక్క‌రికే అభిమాని అయి ఉండాల‌నే రూల్ లేద‌ని.. ప‌వ‌న్ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ కాదు.. నా ఫ్యాన్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కాదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాడు బ‌న్నీ. క‌చ్చితంగా అంద‌రూ అంద‌రినీ అభిమానించాల‌నే రూల్ లేద‌ని.. ఫ్యాన్స్ అన్న త‌ర్వాత క‌చ్చితంగా చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌స్తాయ‌ని అవి ఉన్నాయ‌ని కూడా చెప్పాడు అల్లుఅర్జున్. ఆ గొడ‌వ‌లు లేవ‌ని చెప్పేంత మూర్ఖున్ని తాను కాద‌ని అన్నాడు బ‌న్నీ. మొత్తానికి మెగా ఫ్యామిలీలో గొడ‌వ‌లు ఉన్నాయో లేవో తెలియ‌దు కానీ ఫ్యాన్స్ లో మాత్రం చీలిక‌లు ఉన్నాయ‌ని ఒప్పుకున్నాడు బ‌న్నీ.StylishStar AlluArjun BirthdayCelebrations 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here