మే 1 న 'మహానటి' పాటలు విడుదల


‘మహానటి’ చిత్ర పాటలు మే 1 న విడుదల కానున్నాయి. ఇటీవలే విడుదలైన ‘మూగ మనసులు’ అనే మొదటి పాటకు విశేష స్పందన వచ్చింది. మిక్కీ జె. మేయర్ సమకూర్చిన బాణీలు అలనాటి ఆణిముత్యాలాంటి పాటలకు దీటుకు ఉన్నాయని అంటున్నారు. చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చింది. సావిత్రిగా కీర్తి సురేష్ ఒదిగిపోయింది.
జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించే ఈ చిత్రంలో సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. ఉన్నత నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకం తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు.
మహానటుడు ఎస్.వి. రంగారావు గారి ప్రత్యేక పాత్రలో డా. మోహన్ బాబు గారు కనిపించనున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్రను ఆయన మనవడు హీరో నాగ చైతన్య పోషిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, శాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న “మహానటి” చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here