మోక్షజ్ఞ ఇప్ప‌ట్లో రాన‌ట్లేనా..?

 

బాల‌య్య వార‌సుడి ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య బాల‌య్య కూడా త్వ‌ర‌లోనే త‌న వార‌సుడి ఎంట్రీ ఉంటుంద‌ని చెప్పాడు. దాంతో సంబ‌రాలు చేసుకున్నారు నంద‌మూరి ఫ్యాన్స్. ఇప్ప‌టికే ఈ కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోల్లో పెద్దాయ‌న త‌ర్వాత బాల‌య్య‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్..
క‌ళ్యాణ్ రామ్ నిల‌బ‌డ్డారు. ఇందులో క‌ళ్యాణ్ ఒక్క‌డే స్టార్ కాలేక‌పోయాడు. ఇక ఇప్పుడు బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ కూడా వ‌స్తున్నాడ‌ని ఖాయ‌మైపోయింది. ఈయ‌న ఫిజిక్ పై దృష్టి పెడుతున్నాడ‌ని.. సిక్స్ ప్యాక్ చేస్తున్నాడ‌ని ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. కానీ ఇప్పుడు మోక్షు ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. తాజాగా ఇంట్లో జ‌రిగిన ఓ వేడుక‌లో పాల్గొన్న మోక్షు.. భారీ ఫిజిక్ తో క‌నిపించాడు. నిండా 21 ఏళ్లు కూడా లేని మోక్ష‌జ్ఞ‌.. ఈ ఫిజిక్ తో ఉండ‌టం చూసి ఫ్యాన్స్ డీలా ప‌డుతున్నారు.
అస‌లు మ‌నం చూస్తున్న‌ది నిజంగా బాల‌య్య వార‌సున్నేనా అనే అనుమానం వ‌చ్చేలా లావుగా ఉన్నాడు ఈ కుర్రాడు. ఇలా ఉంటే హీరో ఎలా అవుతాడు.. కొంప‌దీసి ఇప్ప‌ట్లో మోక్ష‌జ్ఞ‌ను తెర‌పై చూడ‌టం క‌ష్ట‌మేనా అనుకుంటున్నారు అభిమానులు. ఇప్ప‌టికే వార‌సులు ఒకొక్క‌రుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. నాగ‌చైత‌న్య‌, రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ లాంటి వాళ్లు వ‌చ్చేసారు. మూడేళ్ల కింద అఖిల్ కూడా వ‌చ్చేసాడు. ఈ త‌రం వార‌సుల్లో మిగిలిపోయింది ఈ కుర్రాడొక్క‌డే. అఖిల్ 20 ఏళ్ల‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. చ‌ర‌ణ్ కూడా అప్ప‌ట్లో 22 ఏళ్ల‌కే హీరో అయ్యాడు..
బ‌న్నీ అయితే మ‌రీ 18 ఏళ్ల‌కే వ‌చ్చేసాడు.. నాగ‌చైత‌న్య 22 కు వ‌చ్చాడు.
ఇప్పుడు మోక్షజ్ఞ‌ వంతు. బాల‌య్య ఫామ్ లో ఉండ‌గానే మోక్షు వ‌స్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికి బాల‌య్య కూడా స‌మాధానం చెప్పేసాడు. 2018 జూన్ త‌ర్వాత అప్పుడెప్పుడో చెప్పినా ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే 2020 లో కూడా వ‌చ్చేలా లేడు. మ‌రోవైపు ఈయ‌న తొలి సినిమా కోసం రానే వ‌చ్చాడు రామ‌య్యా అంటూ సాయికొర్ర‌పాటి టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ప్ర‌స్తుతం న‌ట‌న‌పైనే దృష్టిపెట్టాడు ఈ కుర్రాడు. మోక్ష‌జ్ఞ త‌ర్వాత..
మ‌రో కొత్త వార‌సుడు రావ‌డానికి త‌క్కువ‌లో త‌క్కువ ప‌దేళ్లు ప‌ట్ట‌డం ఖాయం. ప‌వ‌న్ కొడుకు అఖీరానంద‌న్, మ‌హేశ్ త‌న‌యుడు గౌత‌మ్, వెంక‌టేశ్ కొడుకు అర్జున్.. వీళ్లందరి వ‌య‌సు ఇప్పుడు 10-12 ఏళ్లే. వీళ్లంద‌రూ హీరోలవ్వాలంటే మ‌రో ప‌దేళ్లు గ్యారెంటీ. మ‌రి ఈ కొత్త నంద‌మూరి వార‌సుడు ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here