మ‌న‌సుకు న‌చ్చ‌క‌పోతే క‌ష్ట‌మే..!

Manasuku Nachindi
వ‌ర‌స‌గా సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఒక్క విజ‌యం కూడా అందుకోలేక వెన‌క‌బ‌డిపోతున్నాడు సందీప్ కిష‌న్. గ‌త ఏడాది టైమ్ లో నాలుగు సినిమాలు చేసాడు ఈ కుర్ర హీరో. కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. తెలుగు, త‌మిళ సినిమాలు ఎన్ని చేసినా కూడా సందీప్ కు విజ‌యం మాత్రం రావ‌డం లేదు. ఇప్పుడు మ‌న‌సుకు న‌చ్చింది అంటూ మ‌రో సినిమాతో వ‌చ్చేస్తున్నాడు ఈ హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ సినిమాల‌తో వ‌చ్చిన ఈ హీరో.. ఇప్పుడు వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో ద‌ర్శ‌నం ఇస్తున్నాడు. ఈయ‌న న‌టించిన మ‌న‌సుకు న‌చ్చింది ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌ల‌వుతుంది. కృష్ణ కూతురు మంజుల తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అమైరా ద‌స్తూర్, త్రిదా చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు.
న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రం తెర‌కెక్కించింది మంజుల‌. ట్రైల‌ర్ చూస్తుంటే క‌చ్చితంగా యూత్ ను టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మైపోతుంది. ఇక అక్క కోసం ఈ సినిమాకు మ‌హేశ్ కూడా త‌న‌వంతు ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. హీరోయిన్ల అందాల ఆర‌బోత ట్రైల‌ర్ లో బాగానే హైలైట్ చేసారు. పైగా త్రిదాచౌద‌రి బికిని కూడా వేసింది ఈ చిత్రంలో. ఇక సందీప్ కిష‌న్, అమైరా మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ కూడా సినిమాపై బాగానే ఆస‌క్తి పెంచేస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎలా ఉంటున్నాయ‌నే కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం తెర‌కెక్కించింది మంజుల‌. టైటిల్ కూడా సింపుల్ గా ఉండేలా మ‌న‌సుకు న‌చ్చింది అని పెట్టింది. ఈ చిత్రంతో అయినా ఒక్క హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు సందీప్ కిష‌న్. మ‌రి ఈయ‌న ఆశ‌లు ఇప్ప‌టికైనా తీరేనో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here