మ‌ళ్లీ క‌బాలి అంటున్న‌వేంటి కాలా..?


ర‌జినీకాంత్ సినిమా అంటే అభిమానుల్లో అంచ‌నాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ప్రతీ చిన్న విష‌యంలోనూ క్వాలిటీ కోరుకుంటారు వాళ్లు. ఈ మ‌ధ్య ర‌జినీ సినిమాల్లో ఇది లేకే వ‌ర‌స‌గా ఫ్లాపులు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం కాలా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రం జూన్ 7న రానుంది.
రంజిత్ తెర‌కెక్కించిన ఈ చిత్ర టీజ‌ర్ కు ఇప్ప‌టికే రెస్పాన్స్ అదిరిపోయింది. ఇప్పుడు పాట కూడా విడుద‌లైంది. ఇక్క‌డే ఉంది అస‌లు క‌థ‌. క‌బాలికి సంగీతం అందించిన సంతోష్ నారాయ‌ణ్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ ఇచ్చాడు. అదేం విచిత్ర‌మో కానీ ఇప్పుడు కాలా పాట కూడా అచ్చంగా క‌బాలి పాట మాదిరే ఉంది. ఈ పాట‌కు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. పై నుంచి అదేంటి క‌బాలి పాట‌నే మ‌ళ్లీ ఎందుకు కొట్టారు అంటూ అడుగుతున్నారు అభిమానులు.
దీన్నిబ‌ట్టే పాట ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. క‌బాలి పాట‌ల‌కు అప్ప‌ట్లో మంచి క్రేజ్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు కాలాకు అది జ‌ర‌గ‌డం లేదు. చూస్తుంటే ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా మున‌ప‌టిలా క‌నిపించ‌ట్లేదు. విడుద‌ల‌కు ముందు ర‌జినీ మేనియాతో మ‌ళ్లీ ఏదైనా క్రేజ్ వ‌స్తుందేమో కానీ ఇప్పుడు పాట‌తో అయితే పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు సినిమాకు. మే 9ప ఫుల్ ఆల్బ‌మ్ విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here