మ‌హాన‌టికి స‌హ‌న‌టి స‌పోర్ట్..


మ‌హాన‌టి అంటే కేరాఫ్ కీర్తిసురేష్. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ ఆమె కాబ‌ట్టి.. సావిత్రి పాత్ర‌లో న‌టిస్తుంది ఆమె కాబ‌ట్టి. కానీ ఇప్పుడు అది జ‌ర‌గ‌డం లేదు. మ‌హాన‌టి అంటే ఇప్పుడు కేరాఫ్ స‌మంత అయిపోతుంది. ప్ర‌మోష‌న్ కూడా ఆమె చేతుల‌మీదుగానే జ‌రుగుతుంది.
ఎక్కువగా స్యామ్ క‌నిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్పుడు స‌మంత సూప‌ర్ ఫామ్ లో ఉంది. ఈమె న‌టించిన రంగ‌స్థ‌లం ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తుంది. 100 కోట్ల‌కు పైగా షేర్ సాధించింది ఈ చిత్రం. ఇందులో రామ‌ల‌క్ష్మిగా అద్భుతంగా న‌టించింది స‌మంత‌. ఈ క్రేజ్ ఇప్పుడు మ‌హాన‌టికి కూడా యూజ్ కానుంది. ఈ చిత్రంలో కూడా 80ల్లో ముద్దుగుమ్మ‌గానే న‌టిస్తుంది. జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణిగా మాయ చేయ‌డానికి రెడీ అవుతుంది స‌మంత‌. మ‌హాన‌టి క‌థ అంతా మ‌ధుర‌వాణి కోణంలోంచే సాగుతుంది.
ఆమె సావిత్రి క‌థ‌ను చెబుతుంది. ఇక ఆమె ప్రియుడు విజ‌య్ ఆంటోనీగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రి లుక్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తున్నాయి. సినిమా మే 9న విడుద‌ల కానుంది. అన్న‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు కీర్తిసురేష్ లుక్ బ‌య‌టికి రాలేదు క‌దా.. ఎప్రిల్ 14న ఓ టీజ‌ర్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో అభిన‌వ సావిత్రి ఎలా ఉండ‌బోతుందో ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత అయినా త‌న న‌ట‌న‌తో స‌మంత‌ను కీర్తి డామినేట్ చేస్తుందో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here