మ‌హాన‌టి.. ఇది మ‌హా విజ‌యం..

Mahanati
మ‌హాన‌టి అంటే ఈ తరానికి ఏం తెలుసు..? ఒక్క సావిత్రి మంచి న‌టి అని మాత్ర‌మే తెలుసు. కానీ ఆమె గురించి తెలుసుకోడానికి ఆ త‌రం కంటే ఈ త‌ర‌మే ఎక్కువ‌గా థియేట‌ర్స్ కు ప‌రుగు పెడుతున్నారు. దానికి ఫ‌లితమే ఇప్పుడు మ‌హాన‌టికి వ‌స్తున్న స్పంద‌న‌.. వ‌సూళ్లు.
తొలిరోజు యుఎస్ లో స్టార్ హీరోల‌కు ధీటుగా వ‌సూళ్లు రాబ‌ట్టింది మ‌హాన‌టి. రెండో రోజు కూడా అదే దూకుడు సాగుతుంది. ఈ జోరు చూస్తుంటే తొలి వారాంతంలోపే మిలియ‌న్ మార్క్ దాటేసి.. 1.5 వైపు ప‌రుగులు పెట్టేలా క‌నిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మ‌హాన‌టి దూకుడు మామూలుగా లేదు. ఇక్క‌డ కూడా తొలిరోజే 4 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. దీన్నిబ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు సినిమా రేంజ్ ఏంటో అనేది.
ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తెలుగు వాళ్లు ఎక్క‌డున్నా ఈ మ‌హాన‌టికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. నాగ్ అశ్విన్ మూడేళ్ల క‌ష్టానికి.. స్వ‌ప్న సినిమా ఊహ‌ల‌కు ఈ మ‌హాన‌టి ప్రాణం పోసింది. మ‌హా విజ‌యంతో స‌గ‌ర్వంగా తెలుగు సినిమా చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోయింది మ‌హాన‌టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here