మ‌హాన‌టి.. మ‌హాద్భుతం..


ఇప్పుడు ఇదే అంద‌రినోటా వినిపిస్తున్న మాట‌. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే మ‌హాన‌టి ప్రీమియ‌ర్స్ ప‌డిపోయాయి. అక్క‌డ్నుంచి వ‌చ్చిన టాక్ ప్ర‌కారం చూస్తుంటే సినిమా మ‌రో స్థాయిలో ఉంద‌ని అర్థ‌మైపోతుంది. సినిమా చూసిన త‌ర్వాత క‌చ్చితంగా కంట‌త‌డి పెట్ట‌కుండా బ‌య‌టికి రాలేరు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట‌. కీర్తిసురేష్ త‌న కెరీర్ లోనే కాదు..
జీవితంలోనే నిలిచిపోయే పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇక స‌మంత కూడా ఉన్నంత వ‌ర‌కు అద్భుతంగా న‌టించింది అంటున్నారు. దానికితోడు జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రాణం పోసాడు. ఇలా ఎవ‌రికి వాళ్ళు మ‌హాన‌టిని త‌మ భుజాల‌పై మోసారంటున్నారు ప్రేక్ష‌కులు. ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్స్ తోనే 2 ల‌క్ష‌ల‌కు పైగా డాల‌ర్లు వ‌సూలు చేసింది మ‌హాన‌టి.
సినిమాలో మాయాబ‌జార్ సీన్ తో పాటు క్లైమాక్స్ లో సావిత్రి ట్రాజ‌డీ సీన్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయ‌ని.. క‌చ్చితంగా ఇది తెలుగు సినిమా చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోతుంద‌ని చెబుతున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్. మ‌రి చూడాలిక‌.. ఇక్క‌డ రెస్పాన్స్ ఎలా ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here