మ‌హాన‌టి 100 కోట్లు.. సాధ్య‌మేనా..?


ఏంటి మ‌హాన‌టికి 100 కోట్లా..? అదెలా సాధ్యం..? అంత మొత్తం ఈ చిత్రానికి ఎందుకు వ‌స్తుంది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే సాధ్య‌మే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్ర దూకుడు అలా ఉంది మ‌రి. ఇప్ప‌టికే 10 రోజుల్లో ఈ చిత్రం దాదాపు 42 కోట్ల గ్రాస్..
24 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇదే దూకుడు మ‌రో వారం రోజులు కొన‌సాగేలా క‌నిపిస్తుంది. అంటే క‌నీసం మ‌రో 20 కోట్ల గ్రాస్ ఖాయం అన్న‌మాట‌. మ‌రోవైపు ఓవ‌ర్సీస్ లో కూడా సినిమా దుమ్ము దులిపేస్తుంది. ఫుల్ ర‌న్ లో తెలుగులోనే దాదాపు 32-34 కోట్ల మ‌ధ్య షేర్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అంటే గ్రాస్ దాదాపు 55 కోట్ల‌న్న‌మాట‌. ఇక త‌మిళ‌నాట కూడా ఈ చిత్రం బాగానే వ‌సూలు చేస్తుంది.
అక్క‌డ క‌నీసం 12 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. దానికితోడు మ‌ళ‌యాలంలో దుల్క‌ర్ పుణ్య‌మా అని మ‌రో 8 కోట్ల వ‌ర‌కు రానుంది. ఈ గ్రాస్ దాదాపు 65 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక శాటిలైట్ రైట్స్ 11 కోట్లు వ‌చ్చాయి. ఇక ఈ మ‌ధ్యే డిజిట‌ల్ రైట్స్ కూడా ఏకంగా 18 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి.
అంటే అన్నీ క‌లిపితే ఈజీగా లెక్క 80 కోట్ల‌కు పైగానే చేరిపోయింది. ఏదైనా అద్భుతాలు జ‌రిగితే సినిమా ఇంకా ఎక్కువ తీసుకొచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఎందుకంటే రెండో వారం నుంచి థియేట‌ర్స్ మ‌రో 100కి పైగా పెంచుతున్నారు. మొత్తానికి ఇప్పుడు మ‌హాన‌టి దూకుడు చూస్తుంటే ఏదైనా సాధ్య‌మే అనిపిస్తుంది. చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here