మ‌హేశ్ కు అది సాధ్య‌మేనా..?


మ‌హేశ్ బాబు అంటే మ‌న‌కు గుర్తొచ్చేది ఒక‌టే రూపం. ఏళ్లు మారినా ఈయ‌న మాత్రం మార‌డు. వ‌య‌సు 40 దాటినా ఇప్ప‌టికీ 20 ఏళ్ల బాలా కుమారుడిలా ఉంటాడు సూప‌ర్ స్టార్. అది ఆయ‌న గ్లామ‌ర్. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో కూడా కొత్త లుక్ మాత్రం ట్రై చేయ‌లేదు మ‌హేశ్. ప్ర‌తీ సినిమాలోనూ ఒక‌టే లుక్ లోనే ఉంటాడు. ఇదే ఈయ‌న‌తో వ‌చ్చే స‌మ‌స్య కూడా. క‌థ‌లో కొత్త‌ద‌నం అప్పుడప్పుడూ చూపిస్తాడు కానీ లుక్ లో మాత్రం కొత్త‌ద‌నం చూపించ‌డు. మిగిలిన హీరోలంతా సినిమాకో విధంగా మారిపోతుంటే మ‌హేశ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటానంటాడు. ఈయ‌న లుక్ చూసి మంత్రి కేటీఆర్ కూడా సెటైర్ వేసాడు. తాను ఒక్క రోజు మ‌హేశ్ అయితే ముందు లుక్ మారుస్తాన‌ని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట‌లు మ‌హేశ్ కు కూడా బాగానే గుచ్చుకున్న‌ట్లున్నాయి అందుకే లుక్ మారుస్తున్నాడు.
వంశీ పైడిప‌ల్లి సినిమాలో గ‌డ్డంతో క‌నిపించ‌బోతున్నాడు మ‌హేశ్. గ‌డ్డం లుక్ లో ఉన్న మ‌హేశ్ ను ఊహించుకోవ‌డ‌మే క‌ష్టం. కానీ చేస్తానంటున్నాడు వంశీ. ఈ మ‌ధ్యే భ‌ర‌త్ అనే నేనులో కాసేపు పెట్టుడు మీసంతో క‌నిపించాడు మ‌హేశ్. అలా చేసినందుకే పూర్తిగా కృష్ణ‌లా ఉన్నాడంటూ అంతా అనేసారు. ఇప్పుడు నిజమైన మీసాలు, గ‌డ్డంతో క‌నిపిస్తానంటున్నాడు మ‌హేశ్. ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే అమెరికాలోని లొకేష‌న్లు అన్నీ తిరిగేసి వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. జూన్ నుంచి షూటింగ్ మొద‌లు కానుంది. ఏడాది చివ‌ర్లో సినిమా విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. కొత్త లుక్ లో ఉన్న మ‌హేశ్ ఎలా క‌నిపించ‌బోతున్నాడో..? ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here