మ‌హేశ్ కు అస‌లు సినిమా స్టార్ట్..


విడుద‌ల‌కు ముందే మ‌హేశ్ బాబుకు సినిమా క‌నిపిస్తుంది. దానికి కార‌ణం రామ్ చ‌ర‌ణ్.. అత‌డు న‌టించిన రంగ‌స్థ‌లం. అప్ప‌ట్లో మ‌హేశ్ బాబు పోకిరి రికార్డుల‌ను తిర‌గ‌రాసి మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు చ‌ర‌ణ్. ఇక ఇప్పుడు ఖైదీ నెంబ‌ర్ 150 రికార్డులు క్రాస్ చేసి రంగ‌స్థ‌లంతో స‌రికొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లుకుతున్నాడు.
ఈ చ‌రిత్ర‌లో బాహుబ‌లి ఉండ‌దు. ఎందుకంటే అది మ‌రో రేంజ్ సినిమా కాబ‌ట్టి. రెండు వారాలు పూర్తైన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఎక్క‌డ చూసినా ఈ చిత్ర క‌లెక్ష‌న్ల‌తోనే బాక్సాఫీస్ ఊగిపోతుంది. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని రికార్డుల‌ను ఈ చిత్రం సృష్టిస్తుంది. 14 రోజుల్లోనే 100 కోట్ల మైలురాయి అందుకుంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోనే 75 కోట్ల షేర్ అందుకుని స‌రికొత్త రికార్డుల‌కు తెర‌లేపాడు సిట్టిబాబు. ఇక ఓవ‌ర్సీస్ లోనూ 3.5 మిలియ‌న్ వైపు అడుగేస్తుంది రంగ‌స్థ‌లం. ఇప్పుడు ఈ చిత్రం సృష్టించే ఒక్కో రికార్డ్ భ‌ర‌త్ అనే నేనుతో పాటు నా పేరు సూర్య‌కు స‌వాల్. ఎందుకంటే స్పైడ‌ర్..
బ్ర‌హ్మోత్స‌వం అక్క‌డ అత్యంత దారుణంగా బ‌య్య‌ర్ల‌ను ముంచేసాడు మ‌హేశ్. బ‌న్నీ కూడా డిజేతో కాస్త నిరాశ‌ప‌రిచాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా అల్లుఅర్జున్ రైజింగ్ లో ఉన్నాడు. దాంతో సిట్టిబాబు స‌వాల్ అల్లువార‌బ్బాయి ఇమేజ్ కు ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఖైదీ నెం.150 పేరు మీదున్న నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ త‌న పేర రిజిష్ట‌ర్ చేయించాడు సిట్టిబాబు. దాంతో ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను.. నా పేరు సూర్య హిట్ కొట్టాలంటే ముందు సిట్టిబాబును దాటాలి. అలా దాటితే కానీ అవి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవ్వ‌వు. చూడాలిక‌.. సిట్టిబాబు స‌వాల్ ను ఈ హీరోలు ఎంత‌వ‌ర‌కు తీసుకుంటారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here