మ‌హేశ్ క‌త్తిపై దాడి కూడా ప్లానింగేనా..?

KATHI MAHESH EGG ATTACK
ఇన్నాళ్లూ సైలెంట్ గా మాట‌ల‌తో సాగిన వ్యవ‌హారం ఇప్పుడు దాడి వ‌ర‌కు వెళ్లింది. తొలిసారి క‌త్తి మ‌హేశ్ పై దాడి జ‌రిగింది. ఓ ఛానెల్ నుంచి చ‌ర్చ‌లో పాల్గొని వెళ్తోన్న క‌త్తిపై గుడ్డు దాడి జ‌రిగింది. అయితే ఇది చేసింది ఎవ‌రు అనేది మాత్రం ఇప్పుడు అంతు ప‌ట్ట‌డం లేదు. ఆయ‌నేమో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇది చేసారంటున్నాడు. కానీ క‌త్తి గారికి ప‌వ‌న్ తో మాత్ర‌మే సున్నుం పెట్టుకునుంటే అలాగే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఈయ‌న‌కు ఊరంతా చుట్టాలే క‌దా..!
ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ హీరో ఫ్యాన్స్ వ‌చ్చి దాడి చేస్తారో తెలియ‌దు. ఎందుకంటే సార్ అంద‌ర్నీ గెలికేసి ఉంటాడు క‌దా మ‌రి..! ప్ర‌తీ హీరోను ఈయ‌నే న‌డిపిస్తున్న‌ట్లు అంద‌ర్నీ ఏకి పారేస్తుంటాడు. బాల‌య్య లాంటి స్టార్ హీరోను కూడా సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవ‌చ్చు క‌దా అని ఉచిత స‌ల‌హాలు ఇస్తుంటాడు. అలాంటప్పుడు క‌త్తిపై దాడి చేసింది ప‌వ‌న్ ఫ్యాన్సే అని ఎలా చెప్ప‌గ‌లం..? అస‌లు నిజంగా దాడి జ‌రిగిందా లేదంటే ఇష్యూను సీరియ‌స్ చేయ‌డానికి క‌త్తి వ‌ర్గ‌మే ఇలా చేయించిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు న‌డుస్తున్నాయి. ఇష్యూను సీరియ‌స్ చేసి..
ద‌ళిత సంఘాల స‌పోర్ట్ కూడా తీసుకోడానికి కావాల‌నే ఈ గుడ్డు దాడి జ‌రిగిందా అనే బేస్ మీద పోలీస్ కేస్ జ‌రుగుతుంది. ఇందులో నిజాలు బ‌య‌టికి వ‌చ్చేంత వ‌రకు క‌త్తి బ‌య‌టికి వ‌స్తే క‌చ్చితంగా చెప్ప‌రాని చోట గుచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో.. ఈ గొడ‌వ ఎక్క‌డ ఎండ్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here