మ‌హేశ్ పై మ‌హాన‌టి ప్ర‌భావం..

Mahesh25 look

అదేంటి.. మ‌హేశ్ కు మ‌హాన‌టికి ఏంటి సంబంధం..? ఈయ‌న‌కు ఆ సినిమాతో ఏ విధంగానూ లింక్ లేదు క‌దా అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండ‌స్ట్రీ.. రాజ‌కీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ ముందు వెన‌క చూసుకోవాలి. ఇప్పుడు మ‌హేశ్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. మ‌హేశ్ ఇప్పుడు క‌మిటైన నిర్మాత‌కు ముందు సినిమా తీసుకొచ్చిన విజ‌య‌మే ఇప్పుడు ఈయ‌నకు ఇబ్బందిగా మారింది. అర్థం కాలేదు క‌దా..

సింపుల్ మ‌హాన‌టి విజ‌యం సాధించ‌డంతో అశ్వినీదత్-దిల్ రాజు కాంబినేష‌న్ లో రావాల్సిన వంశీ పైడిప‌ల్లి సినిమాలో కాస్త లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అది ప్రాజెక్ట్ పై ఎఫెక్ట్ ప‌డేంత కాదు కానీ ముందు అనుకున్న దానికంటే అశ్వినీదత్ లాభాల్లో వాటా ఎక్కువ అడ‌గ‌టం మాత్రం ఇప్పుడు దిల్ రాజుకు కాస్త అసంతృప్తిని తెస్తుంద‌ని వినిపిస్తున్న వార్త‌లు. నిజానికి ఈ చిత్రం అనౌన్స్ కాక ముందు అశ్వినీదత్ పూర్తిగా డౌన్ ఫాల్ లోనే ఉన్నారు. ఈయ‌న హిట్ సినిమా చేసి చాలా ఏళ్లైపోయింది. ఇలాంటి టైమ్ లో మ‌హేశ్ ఆఫ‌ర్ ఇచ్చాడు..

దిల్ రాజు షేర్ ఇచ్చాడు. మ‌హాన‌టితో బౌన్స్ బ్యాక్ అయిన ఈ నిర్మాత‌.. ఇప్పుడు ప్ర‌జెంట‌ర్ గా కాకుండా లాభాల్లో స‌మాన వాటా కావాలంటున్న‌ట్లు తెలుస్తుంది. దాంతో ఈ ప్రాజెక్ట్ కాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. అయితే అన్నీ చూస్తున్న మ‌హేశ్ బాబు త‌నే ద‌గ్గ‌రుండి ఇద్ద‌రు నిర్మాత‌ల‌ను స‌ముదాయించాడ‌ని.. అన్నీ కూల్ గా అయ్యేలా చూసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు దిల్ రాజు.. అటు అశ్వినీద‌త్ ఇద్ద‌రూ ఈయ‌న‌కు కావాల్సిన వాళ్లే. ఇద్ద‌రూ గ‌తంలో మ‌హేశ్ కు హిట్లిచ్చారు. మొత్తానికి వంశీ పైడిప‌ల్లి సినిమా జూన్ 17 నుంచి డెహ్రాడూన్ లో మొద‌లు కానుంది. ఇదే ఏడాది డిసెంబ‌ర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది. అన్నీ కుదిర్తే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల కావ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here