మ‌హేశ్ మాట వింటున్న బ‌న్నీ..

 

అవును.. పెద్ద‌ల మాట వినాల‌ని మ‌న పెద్దోళ్లు చెబుతుంటారు క‌దా..! ఇప్పుడు బ‌న్నీ ఇదే చేస్తున్నాడు. ఈయ‌న మ‌హేశ్ మాట వింటున్నాడు. ఈ మ‌ధ్యే భ‌ర‌త్ అనే నేను బ‌హిరంగ స‌భ‌లో సూప‌ర్ స్టార్ చెప్పిన మాట‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నాడు అల్లుఅర్జున్. ఇంత‌కీ ఏ విష‌యంలో మ‌హేశ్ ను బ‌న్నీ ఫాలో అవుతున్నాడో తెలుసా..? ప‌్రీ రిలీజ్ ఫంక్ష‌న్ విష‌యంలో.
అవును.. ఆయ‌న ఎల్బీ స్టేడియంలో ఫంక్ష‌న్ చేసుకున్నాడ‌ని ఇప్పుడు బ‌న్నీ కూడా గ‌చ్చిబౌలి స్టేడియం బుక్ చేసుకున్నాడు. ఈయ‌న న‌టిస్తోన్న నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక ఎప్రిల్ 28 లేదంటే 29 తేదీల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇక బ‌హిరంగ స‌భ‌కు ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా పిలిచాడు.
ఇక ఇప్పుడు బ‌న్నీ కూడా ఇదే చేస్తున్నాడు. ఆ వేడుక‌కు ఎన్టీఆర్ వ‌స్తే.. ఈ వేడుక‌కు ఏకంగా ప్ర‌భాస్ ను తీసుకొస్తున్నాడు అల్లుఅర్జున్. ఎప్ప‌ట్నుంచో బ‌న్నీ, ప్ర‌భాస్ స్నేహితులు. అప్ప‌ట్లో ఆర్య 2 వేడుక‌కు కూడా బ‌న్నీ వ‌చ్చాడు. ఆ త‌ర్వాత ఏక్ నిరంజ‌న్ ఆడియోకు బ‌న్నీ వ‌చ్చాడు.
ఇలా ఒక‌రి కోసం మ‌రొక‌రు వ‌స్తూనే ఉన్నారు. ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీ కోసం ప్ర‌భాస్ వ‌స్తున్నాడు. టాలీవుడ్ లో మారుతున్న ఈ ట్రెండ్ ఇప్పుడు అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం నింపుతుంది. ఓ హీరో వేడుక‌కు మ‌రో హీరో వ‌స్తే ఇద్ద‌రి అభిమానుల‌తో సంద‌డిగా మారుతుంది ఫంక్ష‌న్. మ‌రి చూడాలి.. ఎల్బీలో బ‌హిరంగ స‌భ బ్లాక్ బ‌స్ట‌ర్.. మ‌రి నా పేరు సూర్య గ‌చ్చిబౌలి స‌భ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here