మ‌హేశ్ హ్యాండ్ అస‌లు ప‌ని చేయ‌లేదుగా..!

సాధార‌ణంగా తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ ఇమేజ్ ఉంది. మ‌హేశ్ బాబుతో న‌టిస్తే ఆ త‌ర్వాత ముద్దుగుమ్మ జాత‌కం మారిపోతుంది అని. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన సోనాలి బింద్రే, బిపాసా బ‌సు, లిసారే, ప్రీతిజింటా, అమీషా ప‌టేల్ లాంటి వాళ్లు మ‌హేశ్ తో రొమాన్స్ చేసిన వాళ్లే. కానీ ఒక్క  కృతిస‌నన్ విష‌యంలోనే ఎందుకో గానీ మ‌హేశ్ హ్యాండ్ అస్స‌లు ప‌ని చేయ‌లేదు. నేనొక్క‌డినే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన బ్యూటీ.. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి ఆ త‌ర్వాత దోచేయ్ సినిమాలో చైతూతో న‌టించింది. ఆ వెంట‌నే బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్క‌డే వ‌ర‌స సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి కాలం అస‌లు క‌లిసి రావ‌డం లేదు. 2015లో వ‌చ్చిన దిల్ వాలే త‌ర్వాత చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ కృతిస‌నన్ చెంత చేర‌లేదు. దాంతో చేసేదేమీ లేక హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్యే ప్రియుడు సుశాంత్ సింగ్ తో క‌లిసి న‌టించిన రాబ్తా కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. దాంతో చేసేదేం లేక ఫోటోషూట్ ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అడిగిన వాళ్ల‌కు లేద‌న‌కుండా ఎంత కావాలంటే అంత రెచ్చిపోతుంది కృతి. ఈ అందాల ఆకృతి చూసి అబ్బో అనుకున్నారంతా. కానీ అవ‌కాశాలు మాత్రం ఎవ్వ‌రూ ఇవ్వ‌ట్లేదు. చూడాలి మ‌రి.. ఈ బ్యూటీ గ్లామ‌ర్ షో చూసిన త‌ర్వాతైనా ఏ ద‌ర్శ‌కుడైనా క‌రిగిపోకుండా ఉంటాడేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here