సూపర్ స్టార్ సినిమా అంటే ఆ మాత్రం సంచలనాలు ఉండాలి కదా. లేకపోతే ఆయన సూపర్ స్టార్ ఎందుకు అవుతాడు.. సోషల్ మీడియాలో కింగ్ ఎందుకు అవుతాడు..? ఇప్పుడు తన 25వ సినిమా టీజర్ తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు మహేశ్ బాబు. ఈయన పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ టీజర్ ఇండియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చిన కంపెనీ సిఈఓగా ఇందులో నటిస్తున్నాడు మహేశ్.
బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కాలర్ ఎగరేస్తూ నడిచొస్తున్న మహేశ్ ను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. పైగా మీసాలతో మరింత కొత్తగా ఉన్నాడు సూపర్ స్టార్. ఈ టీజర్ కు ఇప్పుడు రోజులోనే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇంత వేగంగా 30 లక్షల మార్క్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఈ జాబితాలోకి మహేశ్ కూడా చేరిపోయాడు.
రైతు సమస్యల ఆధారంగా మహర్షి తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది. అల్లరి నరేష్ కూడా ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నాడు. 25వ సినిమా కావడంతో దర్శకుడు కూడా ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో మహేశ్ నుంచి ఊహించని లుక్ ఇది. ఫ్యాన్స్ ఊహలు అంచనాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టే ఇంతగా జాగ్రత్త పడుతున్నాడు వంశీ. సినిమా వచ్చే ఏడాది ఎప్రిల్ 5న విడుదల కానుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.