యామ్ అర్జున్.. స్టిల్ వ‌ర్జిన్..!


బెంగాల్ టైగ‌ర్ సినిమాలో పోసాని కృష్ణ‌ముర‌ళి చెప్పిన డైలాగ్ గుర్తుందా..? ఆ సినిమాలో యామ్ అర్జున్.. స్టిల్ వ‌ర్జిన్ అంటూ పేలిపోయే డైలాగ్ చెప్పాడు పోసాని. ఇప్పుడు ఇదే డైలాగ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా చెప్పాడు. ఈయ‌న ప్ర‌స్తుతం గీతా గోవిందం సినిమాలో న‌టిస్తున్నాడు. ప‌రుశురామ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
అయితే ఇప్పుడు మ‌రో లుక్ కూడా విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంపై క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు ప్రేక్ష‌కులు. దానికి ప‌రుశురామ్ టేకింగ్ కూడా కార‌ణ‌మే. ఎందుకంటే శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇది.
అయిఏత ఇప్పుడు విడుద‌లైన లుక్ లో మాత్రం ఐ యామ్ 25.. స్టిల్ వ‌ర్జిన్ మేడ‌మ్ అంటూ విజ‌య్ ర‌చ్చ మొద‌లుపెట్టాడు. ఇది క‌చ్చితంగా విజ‌య్ ఐడియా అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అర్జున్ రెడ్డికి నెగిటివ్ ఇమేజ్ ఎంత ప‌నికొచ్చిందో ఈ హీరోకు తెలుసు. అందుకే ప్ర‌మోష‌న్ కోసం కొత్త‌గా ఆలోచిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి వ‌ర్జిన్ డైలాగ్ తో గీతాగోవిందంపై అంచ‌నాలు భారీగానే పెరిగిపోయాయి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here