యూట్యూబ్ ను కుమ్మేస్తున్న ఆచారి..

ACHARI AMERICA YATRA TRAILER 1 MILLION VIEWS
ఆచారి దూకుడు మామూలుగా లేదిప్పుడు. ఈయ‌న త‌లుచుకుంటే అమెరికా మొత్తం షేక్ అయిపోయేలా ఉంది. ఆచారి అమెరికా యాత్ర‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తుంది. విష్ణు సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు లేనంత.. రానంత క్రేజ్ ఈ చిత్రానికి వ‌చ్చింది. ఒక్క రోజులోనే ఈ చిత్ర ట్రైల‌ర్ కు మిలియన్ మార్క్ అందుకుంది. జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది. జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఎమ్ఎల్ కుమార్ చౌద‌రి నిర్మించారు. ట్రైల‌ర్ తోనే సినిమాపై అంచ‌నాలు తారాస్థాయికి చేరిపోయాయి. చూస్తుంటే విష్ణు కెరీర్ లోనే ఇది పెద్ద హిట్ గా నిలిచే అవ‌కాశాలు చాలా క‌నిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి 26న భాగ‌మ‌తితో క‌లిసి ఈ చిత్రం పోటీ ప‌డ‌నుంది. ఆ రోజు రావాల్సిన మ‌న‌సుకు న‌చ్చింది.. విశాల్ అభిమన్యుడు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో ఆచారి దూకుడుకు బ్రేకులే లేకుండా పోయాయిప్పుడు. రావ‌డం బాక్సాఫీస్ ను న‌వ్వుల్లో ముంచెత్త‌డం మాత్ర‌మే ఇప్పుడు మిగిలాయి. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో దేనికైనా రెడీ.. ఆడోర‌కం ఈడోర‌కం సినిమాలు విజ‌యాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమా ఈ కాంబినేష‌న్ లో వ‌స్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఆచారి దూకుడు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here