రంగ‌స్థ‌లంకు 100 కోట్లు వ‌చ్చేసాయ‌బ్బా..!

Rangasthalam
వ‌చ్చేసింది.. 100 కోట్ల షేర్ వ‌చ్చేసింది.. తెలుగు సినిమాలో రెండో 100 కోట్ల సినిమా వ‌చ్చేసింది.. ఖైదీ నెం.150 త‌ర్వాత మ‌రోసారి 100 కోట్ల షేర్ తీసుకొచ్చిన సినిమా వ‌చ్చేసింది.. ఇక్క‌డ బాహుబ‌లి స‌ప‌రేట్. అది తెలుగు సినిమా కాదు. ఇంట‌ర్నేష‌నల్ సినిమా. ఆ రేంజ్ అలాంటిది. అందుకే నాన్ బాహుబ‌లి అంటూ తెలుగులో మ‌రో రికార్డుల వేట మొద‌లైంది. అందులో చిరంజీవి అందరి కంటే ముందున్నాడు.
ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చినా కూడా ప‌దేళ్లుగా ఎవ‌రూ చేయ‌లేని రికార్డు చేసి చూపించాడు చిరు. ఖైదీ నెం.150తో వ‌చ్చీ రావ‌డంతోనే 100 కోట్ల మైలురాయి అందుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్.. మ‌హేశ్.. ఎన్టీఆర్ లాంటి హీరోలు వ‌చ్చినా ఖైదీ నెం.150 రికార్డులు మాత్రం అందుకోలేదు. ఇప్పుడు ఆ అవ‌కాశం మ‌ళ్లీ త‌న‌యుడికే ద‌క్కింది.
ఈయ‌న రంగ‌స్థ‌లం 13 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 100.92 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.  ఓవ‌ర్సీస్ లో కూడా 3.3 మిలియ‌న్ అందుకుని నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు తెర‌తీసింది రంగ‌స్థ‌లం. ఈ వీకెండ్ ముగిసే స‌రికి 3.5 మిలియ‌న్ మ‌ధ్య‌లో రంగ‌స్థ‌లం ప్ర‌యాణం ఆగేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఇది సృష్టించిన రికార్డులు భ‌ర‌త్ అనే నేనుకు స‌వాల్ గా మారాయి. ఇప్పుడు క‌చ్చితంగా మ‌హేశ్ త‌న స్టామినా నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ లో మార్కెట్ లేని చ‌ర‌ణ్.. ఇప్పుడు ఒకే సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ త‌న పేర రాసుకున్నాడు.
మ‌రి చూడాలి.. చివ‌రి వ‌ర‌కు సిట్టిబాబు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో..? ఇప్ప‌టికే ఈ చిత్రం ఖాతాలో 101 కోట్ల షేర్ వ‌చ్చి చేరింది. మ‌రి చూడాలిక‌.. మూడో వారాంతంలో రంగ‌స్థ‌లం జోరు ఎలా ఉండ‌బోతుందో..? 110 కోట్లు రంగ‌స్థ‌లం ఖాతాలో ప‌డ‌తాయో లేదో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here