రంగ‌స్థ‌లం అదిరిపోయింది.. ఇక డాన్సులే..

Ram Charan Rangasthalam
రంగా రంగా రంగ‌స్థ‌లానా అంటూ రెచ్చిపోయాడు రామ్ చ‌ర‌ణ్. ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ లేనంత రేంజ్ లో మాస్ మాస్ ర‌చ్చ చేసి పారేసారు దేవీ శ్రీ ప్ర‌సాద్ అండ్ సుకుమార్. తెలుగులో ఎప్పుడో క‌నుమ‌రుగైపోయిన ప‌క్కా జాన‌ప‌ద గేయాన్ని ప్రేక్ష‌కుల కోసం అందించాడు రామ్ చ‌ర‌ణ్. ఇక ఈ పాట‌లో చ‌ర‌ణ్ స్టెప్పులు కూడా కేక పెట్టిస్తున్నాయి. విజువ‌ల్ తో పాటే వ‌చ్చిన ఈ లిరిక‌ల్ సాంగ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తుంది. రంగ‌స్థ‌లం షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఎంత స‌క్క‌గున్నావే పాట కోటికి పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు విడుద‌లైన రంగ రంగ రంగ‌స్థ‌లానా టైటిల్ సాంగ్ అయితే మాట‌ల్లేవు. నిజ‌మైన క‌ళాకారుల‌ను తీసుకొచ్చి ఈ పాట‌కు మ్యూజిక్ ఇప్పించాడు దేవీ.
ఒక‌రోజు ముందు విడుద‌లైన చిన్న ఆడియోనే సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది. దీన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదేమో..? ఆ ర‌చ్చ‌ను చూసి ఎంజాయ్ చేయాల్సిందే. రంగ రంగ రంగ‌స్థ‌లానా అంటూ సాగే ఈ పాట క‌చ్చితంగా ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయం. దేవీ శ్రీ ప్ర‌సాద్ కూడా ఈ పాట‌లో క‌నిపిస్తున్నాడు. ఈ పాట‌తో సినిమాపై అంచ‌నాలు క‌చ్చితంగా తారాస్థాయికి వెళ్లిపోయాయి. కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్య మిన‌హా బ్లాక్ బ‌స్ట‌ర్ లేని సుకుమార్.. రంగ‌స్థ‌లంతో ఆ కోరిక తీర్చుకునేలా క‌నిపిస్తున్నాడు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here