రంగ‌స్థ‌లం ఫోక్ సాంగ్ అదుర్స్..

 
Ram Charan Rangasthalam
ఈ మ‌ధ్య కాలంలో ప‌క్కా ప‌ల్లెటూరి సినిమా చూసి చాలా కాల‌మైంది. అందులోనూ మాస్ సినిమాల‌ను చూసిన‌పుడు ఉండే ఫీలింగే వేరు. ఇప్పుడు రంగ‌స్థ‌లం విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ కు అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. ఇక ఎంత స‌క్క‌గున్నావే పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు సినిమాలోని రెండో పాట విడుద‌ల అవుతుంది. మార్చ్ 2 సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల కానుంది ఈ పాట‌. దీనికి సంబంధించిన చిన్న ఆడియో టీజ‌ర్ విడుద‌లైంది. ఈ పాట‌లో ఊపు చూస్తుంటే రేపు ఫుల్ సాంగ్ విడుద‌లైన త‌ర్వాత డాన్సులు చేయ‌డం ఖాయం. అంత రేంజ్ లో ఫోక్ బీట్ కొట్టాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. నిజ‌మైన జాన‌ప‌ద క‌ళాకారుల‌తోనే ఈ పాట చేసాడు దేవీ. దానికే త‌న బీట్ ఇచ్చాడు. ఇప్పుడు విడుద‌లైన చిన్న బిట్ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తుంది. రంగ రంగ రంగ‌స్థ‌లానా అంటూ సాగే ఈ పాట క‌చ్చితంగా ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయం. దేవీ శ్రీ ప్ర‌సాద్ కూడా ఈ పాట‌లో క‌నిపిస్తున్నాడు. స్టూడియో వ‌ర్ష‌న్ విడుద‌లకు సిద్ధ మైంది ఇప్పుడు. ఈ పాట‌తో సినిమాపై అంచ‌నాలు క‌చ్చితంగా తారాస్థాయికి వెళ్లిపోయాయి. కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్య మిన‌హా బ్లాక్ బ‌స్ట‌ర్ లేని సుకుమార్.. రంగ‌స్థ‌లంతో ఆ కోరిక తీర్చుకునేలా క‌నిపిస్తున్నాడు. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here