రంగ‌స్థ‌లం 3 రోజులు.. రికార్డులివే..!

Rangasthalam Australia
మూడు రోజుల్లోనే చేయాల్సిన అరాచ‌కం మొత్తం చేసాడు సిట్టిబాబు. రామ్ చ‌ర‌ణ్ దెబ్బ‌కు బాక్సాఫీస్ కుదేలైపోతుంది. అస‌లు మెగా వార‌సుడికి ఇంత‌గా మార్కెట్ ఉందా..? ఇంత ఇమేజ్ ఉందా అని అంతా షాక్ అయిపోతున్నారు. అంత‌గా రంగ‌స్థ‌లం ర‌చ్చ సాగుతుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 57 కోట్ల షేర్.. 91 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. బాహుబ‌లి కాకుండా ఏ తెలుగు సినిమాకైనా ఇది రికార్డ్ ఓపెనింగ్సే. మూడు రోజుల ఓపెనింగ్ లో చాలా రికార్డులు బ‌ద్ద‌లైపోయాయి. ముఖ్యంగా బాహుబ‌లి 1 పేరు మీదున్న రెండో రోజు.. మూడో రోజు షేర్స్ కూడా దాటేసింది రంగ స్థ‌లం. బాహుబ‌లి 1 రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 9.. 9.8 కోట్ల షేర్ వ‌సూలు చేస్తే.. రంగ‌స్థ‌లం 9.15.. 10.03 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రెండు రోజుల్లోనే 27 కోట్లు వ‌సూలు చేసింది రంగ‌స్థ‌లం. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రోజుల్లో 57 కోట్ల‌కు చేరువ‌గా ఉన్నాయి ఈ చిత్ర వ‌సూళ్లు. ఈ దూకుడు చూస్తుంటే తొలి వారంలోనే సినిమా 75 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అస‌లు యుఎస్ లో అయితే రంగ‌స్థ‌లం ర‌చ్చ మామూలుగా లేదు. అక్క‌డ మూడు రోజుల్లోనే 2.5 మిలియ‌న్ మార్క్ అందుకుంది రంగ‌స్థ‌లం. నాలుగో రోజు కూడా వ‌సూళ్లు పెద్ద‌గా త‌గ్గ‌లేదు. సుకుమార్ అందించిన ప‌క్కా విలేజ్ డ్రామాకు అమెరికా కూడా ఫిదా అయిపోయింది. 80 కోట్లు వ‌స్తే కానీ ఈ చిత్రం సేఫ్ కాదు. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే ఈజీగా 100 కోట్ల మార్క్ కూడా అందుకునేలా క‌నిపిస్తుంది ఈ చిత్రం. ఇదే జ‌రిగితే ఖైదీ నెం.150 త‌ర్వాత 100 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమాగా రికార్డులు సృష్టించ‌నుంది రంగ‌స్థలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here