'రాజరథం' లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

‘రాజరథం’ లో విశ్వ గా ఆర్య ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది. తన కెరీర్ ప్రారంభంలో అనూప్, నిరూప్ ల తండ్రి సుధాకర్ భండారి 90 లలో రూపొందించిన ‘ప్రేమద కాదంబరి’ అనే కన్నడ టెలి సీరియల్ కి సుదీప్ పని చేశారు. అప్పటినుండి అనూప్, నిరూప్ లు సుదీప్ ని ఊహించుకుని తమ స్టోరీ ఐడియాస్ ని చర్చించుకునేవాళ్ళు. అనూప్ తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సుదీప్ అంతవరకు చేయనటువంటి పోలీస్ పాత్రతో ‘యోధ’ అనే స్క్రిప్ట్ కూడా తయారు చేసుకున్నారు.
అనూప్ తన దర్శకత్వంలో షార్ట్ ఫిలిం ‘వర్డ్స్’ రూపొందించినప్పుడు అనేక అవార్డులు, ప్రశంసలు పొందింది. ఆ షార్ట్ ఫిలిం కి సంబంధించి 2010 లో  ఒక ప్రెస్ మీట్ కి సుదీప్ గెస్ట్ గారు వచ్చి ఎంతో ప్రశంసించారు. అప్పట్లో ‘రాజరథం’ స్క్రిప్ట్ తొలి దశలోనే ఉంది. ఆ ప్రెస్ మీట్ కి సుదీప్ బ్లూ కుర్తా, జీన్స్, సాండల్స్ లో వచ్చారు. ఆ గెటప్ లో సుదీప్ ని చూసిన అనూప్ కి తన ‘రాజరథం’ లో ని విశ్వ పాత్ర గుర్తొచ్చింది. తాను విశ్వ పాత్ర ఆహార్యం ఎలా ఉండాలనుకున్నాడో సుదీప్ ఆ రోజు అలానే కనిపించారు. ‘రాజరథం’ ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాక, అనూప్ తన భార్య, ‘రాజరథం’ కి కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నీతా షెట్టి కి ఈ విషయం చెప్పారు. దానినే రిఫరెన్స్ గా తీసుకుని నీతా షెట్టి ఆర్య లుక్ ని డిజైన్ చేయడం జరిగింది.
ఆర్య అసిస్టెంట్స్ కి కూడా ‘రాజరథం’ లోని ఆర్య లుక్ భలే నచ్చింది. ‘రాజరథం’ లోని విశ్వ పాత్ర, ఆ పాత్ర ఆహార్యం ఆర్య కి అతికినట్టు సరిపోయిందని అంటున్నారు. ఆర్య ని ఎక్కువగా ప్రేమికుడిగానే చూసిన తమకి తమ బాస్ కొత్త డాషింగ్ లుక్ లో కనిపించడం చాలా బాగుంది అంటున్నారు. ఆర్య తినేప్పుడు, నిద్రపోయేప్పుడు, జిమ్ లో కూడా డైలాగులు తన ముందే పెట్టుకుంటున్నారని, దర్శకుడు అనూప్ భండారి ఆర్య ని  టార్చర్ పెడుతున్నారని సరదాగా చెప్పుకొచ్చారు. ఆర్య తన పాత్రని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తెలుగు తన భాష కాదు కాబట్టి డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా రావాలని ఎక్కువ సమయం కేటాయించి ఎన్నో రిహార్సల్స్ చేస్తున్నారు. ‘రంగితరంగ’ కి అభిమాని అయిన ఆర్య, ఆ దర్శకుడి సినిమాలో తన పాత్ర కి పూర్తి న్యాయం చేయాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు.
దర్శకుడు అనూప్ భండారి ఆర్య గురించి చెప్తూ, ” ఆర్య పెద్ద హీరో అయినా ఎంతో వినయంగా ఉంటారు. సెట్ లో కరెక్ట్ టైం కి ఉంటారు, పాత్ర కోసం ఏమడిగినా కాదనకుండా చేస్తారు.”
రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ ‘రాజరథం’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 23 న విడుదలవుతోంది. ‘జాలీ హిట్స్’ బ్యానర్ పై అజయ్ రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మాతలుగా ‘రాజరథం’ రూపుదిద్దుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here