రాజుగాడిపైనే రాజ్ త‌రుణ్ ఆశ‌ల‌న్నీ..!


ఇండ‌స్ట్రీలో ఈ రోజు రేపు వార‌సుల‌కే దిక్కులేదు. ఒక్క ప్లాప్ ప‌డితే వాళ్లే హిట్ కోసం తంటాలు ప‌డుతున్నారు. అఖిల్ ను చూడండి.. ఒక్క హిట్ అంటూ ఎలా తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడో..? అలాంటిది ఏ స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. కానీ అది చేసాడు రాజ్ త‌రుణ్. కానీ ఆ త‌ర్వాత జోరు త‌గ్గించాడు. ప్ర‌స్తుతం ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు.
ఈయ‌న గ‌త సినిమా అంధ‌గాడుతో పాటు రంగుల‌రాట్నం కూడా అంచ‌నాలు అందుకోలేదు. ప్ర‌స్తుతం సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజుగాడు సినిమాలో న‌టిస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది.
త‌న‌కు తెలియ‌కుండానే దొంగ‌త‌నం చేసే అల‌వాటున్న వింత జ‌బ్బుతో బాధ‌ప‌డే పాత్ర‌లో న‌టిస్తున్నాడు రాజ్ త‌రుణ్. అమైరాద‌స్తూర్ ఇందులో హీరోయిన్. ప్ర‌స్తుతం ఈ కుర్ర హీరో ఆశ‌ల‌న్నీ ఈ చిత్రం పైనే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గానే మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు ఈ హీరో. దిల్ రాజు బ్యాన‌ర్ లో అలా ఎలా ఫేమ్ అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. ల‌వ‌ర్ అనే టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది.
శ‌త‌మానం భ‌వ‌తి సినిమానే రాజ్ త‌రుణ్ తో చేయాల్సింది కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా శ‌ర్వానంద్ కు వెళ్లిపోయింది. అలా మిస్సైన ఛాన్స్ ఇప్పుడు అనీల్ కృష్ణ సినిమా రూపంలో ద‌క్కించుకున్నాడు రాజ్ త‌రుణ్. మొత్తానికి బ్యాడ్ టైమ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ లా దిల్ రాజు సినిమా ప‌ట్టేసాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ ల‌వ‌ర్ రాజ్ త‌రుణ్ కెరీర్ కు ఎంత వ‌ర‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here