రాజ్ త‌రుణ్ రంగుల రాట్నం అదిరిందిగా.. 

Rangula Raatnam
కొన్ని సినిమాలు మొద‌లైన‌పుడు అస్స‌లు తెలియ‌దు. అవి షూటింగ్ పూర్తి చేసుకున్న‌పుడు కూడా ప‌ట్టించుకోరు. కానీ ఒక్క టీజ‌ర్ కానీ ట్ర‌ల‌ర్ కానీ వ‌స్తే వాటిపైనే చ‌ర్చ న‌డుస్తుంటుంది. నిన్న‌టి వ‌ర‌కు క‌నీసం సీన్ లో కూడా లేని రంగుల‌రాట్నం సినిమా ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో ఉంది. అస‌లు రాజ్ త‌రుణ్ లాంటి హీరో సంక్రాంతికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, బాల‌య్య లాంటి స్టార్స్ తో పోటీ ఎందుకు ప‌డుతున్నాడు.. ఏంటి ఈ కుర్రాడి ధైర్యం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రంగుల రాట్నం ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత రాజ్ త‌రుణ్ ధైర్యం ఏంటో అర్థ‌మ‌వుతుంది. పైగా ఆ చిత్రానికి నాగార్జున నిర్మాత‌. ఆయ‌న ఊరికే డ‌బ్బులు పెట్ట‌డు క‌దా.. త‌మిళ ద‌ర్శ‌కురాలు శ్రీ‌రంజ‌ని రంగుల‌రాట్నం సినిమాను తెర‌కెక్కించింది. అమ్మాయిల మ‌న‌స్త‌త్వాల‌పై ఈ చిత్రం రూపొందింది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఈ రంగుల రాట్నంను సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అస‌స‌రం ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడో లేదో..? అంటే ఈ మ‌ధ్య మ‌నోడికి వ‌ర‌స‌గా ఫ్లాపులు వ‌చ్చాయి క‌దా అందుకన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here