రాజ‌కీయ నాయ‌కుల‌పై బ‌న్నీ సెటైర్..

ఈ రోజు ఉన్నది ఒక్క‌టే ఇండియా..! అంతా ఇక్క‌డే ఉన్నాం.. అంతా మ‌న దేశం అంటూ గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం..! కానీ కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు మాత్రం త‌మ స్వార్థం కోసం ఇండియాను ముక్క‌లు ముక్క‌లు చేసి పార‌దొబ్బారు. ఒక‌డేమో సౌత్ ఇండియా అంటాడు.. మ‌రొక‌డొచ్చి నార్త్ అంటాడు.. ఇంకొక‌డు ఈస్ట్ అంటాడు.. ఇంకొక‌డు వెస్ట్ అంటాడు.. ఇలా ఒక్క ఇండియాను ఎవ‌డికి కావాల్సిన‌ట్లు వాడు విడ‌గొట్టేసాడు. కానీ ఈ దేశ‌మంతా ఒక్క‌టే. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా మ‌రిచిపోయేలా కుల‌మ‌త ప్రాంతీయ విభేదాలు రెచ్చ‌గొడుతున్నారు రాజ‌కీయ నాయ‌కులు. ఈ ర‌చ్చంతా కేవ‌లం వాళ్ల ప‌బ్బం గ‌డుపుకోవ‌డం కోస‌మే. ఇలాంటి వాళ్ల‌కు ఇప్పుడు బ‌న్నీ అదిరిపోయే సెటైర్ వేసాడు. ఈయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ విడుద‌లైంది. నార్త్ ఇండియా.. సౌత్ ఇండియా.. ఈస్ట్ వెస్ట్ అంటూ అన్ని లేవురా ఉన్న‌ది ఒక్క‌టే ఇండియా..! అంటూ అదిరిపోయే డైలాగ్ చెప్పాడు బ‌న్నీ. ఈ డైలాగ్ ఇప్పుడు చాలా మందికి క‌నెక్ట్ అవుతుంది. పైగా కాన్ టెంప‌ర‌రీ ఇష్యూ కావ‌డంతో సినిమా కూడా ఇదే రేంజ్ లో క‌నెక్ట్ అవుతుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి చూడాలిక నా పేరు సూర్య‌తో  బ‌న్నీ ఇంపాక్ట్ ఎంత‌గా ఉంటుందో..?  ఈ చిత్రం మే 4న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here