రామారావు గారికి పెద్ద ఫ్యాన్ నేను.. బయోపిక్ డైరెక్ట్ చేయాలి అంటే నేను కరెక్ట్ కాదేమో అనుకున్నా: తేజ 

ఎన్టీఆర్.. ఈ మూడు అక్ష‌రాలు తెలుగు తెర‌పైనే కాదు.. తెలుగువారి గుండెల్లో కూడా చిర‌స్థాయిగా నిలిచిపోయాయి. వెండితెర ఇల‌వేల్పే కాదు.. ప్ర‌తీ తెలుగువాడి ఆత్మ‌గౌర‌వ‌పు బావుటా మ‌న అన్న‌గారు. నంద‌మూరి తారక రామారావు అనే పేరులోనే ఏదో తెలియ‌ని మ‌త్తు ఉంది. ఆ పేరును అలా ప‌లుకుతూ ఉండిపోవ‌డ‌మే. ఇప్పుడు ఈ మ‌హానుభావుడి జీవితంపై సినిమా రాబోతుంది. అది కూడా త‌న‌యుడు బాల‌కృష్ణ హీరోగా.ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ముఖ్య అతిథిగా వ‌చ్చి బాల‌య్య‌ను ఆశీర్వ‌దించారు.

 
 
 
ఈ రోజు ప్రత్యేకమైన రోజు..చరిత్రలో నిలిచిపోయే రోజు…విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా గుర్తింపుతెచ్చుకొని.. తెలుగుకు నిండుతనాన్ని తెచ్చి..తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటి చెప్పి..తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి..తెలుగు పౌరుషాన్ని…దేశ రాజకీయ ముఖ చిత్రంలో వెలిగించి…తాను ఒక వెలుగు వెలిగిన…స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర చిత్ర ప్రారంభానికి…ఉప రాష్ట్రపతి గా నేను రాకూడదు….కానీ నియమ నిభందనలు ఎలా ఉన్నా…రామారావు గారంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది..వ్యక్తిగతంగా స్నేహం ఉండటంతో తప్పనిసరిగా రావాలని అనుకున్నాను…ఆయన మంచి పనులు చరిత్రలో నిలిచిపోతాయి…

యన్ టి ఆర్ నాకు తండ్రి, గురు , దైవం అన్నీ…కారణ జన్ముడు…తెలుగు కీర్తి ని దశ దిశల వ్యాప్తి చేసిన వీరుడు.. చరిత్రలో.యన్ టి ఆర్ అనే మాట ఒక హృదయ స్పందన, తెలుగువారి గుండె చప్పుడు.. నాకు తండ్రి, గురు , దైవం అన్నీ…కారణ జన్ముడు…తెలుగు కీర్తి ని దశ దిశల వ్యాప్తి చేసిన వీరుడు..చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు కొందరే పుడతారు…కృషి ఉంటె మనుషులు ఋషులవుతారని నిరూపించిన మహానుభావుడి కడుపున పుట్టడం..ఆయన చరిత్ర తెరెకెక్కించే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం.
యన్.టి.ఆర్ … యన్ అంటే నటనాలయం…ఆయన ఇల్లే ఓ నటనాలయం…అందులో ఆయన నటరాజ..నటసింహుడు…టి అంటే తారమండలంలోని ధ్రువ తారకుడు… ఆర్ అంటే రారాజు, రాజఋషి…రాజకీయ దురంధరుడు యుగంధరుడు..రమణీయ రమ్య సౌమ్య గుణ ధాముడు…ఈ రోజు జరిగింది…ఈ రోజే మర్చిపోతున్న ఈ రోజుల్లో..ఆయన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలి భావి తరాలకి అనే ఒక తలంపు తో ఈ చిత్రాన్ని ప్రారంభించాము.. విష్ణు గారు ఈ ఆలోచనతో రావడం, సాయి కొర్రపాటి గారు ముందుకొచ్చారు…ఆయన పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం…మా నాన్నగారి జీవిత చరిత్రలో మా కుటుంభం పాలు పంచుకోపోతే ఎలా.
పాతాళ భైరవి మార్చ్ 15 రిలీజ్ అయినా… మంచి టాక్ రావడంతో మార్చ్ 29 న ప్రింట్లు పెంచి సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ చేసారు..ఆ చిత్రంతో యన్.టి.ఆర్ గారు మాస్ హీరో అయ్యారు. లవ కుశ సినిమా రిలీజ్ అయ్యింది మార్చ్ 29. నాన్నగారి మొదటి కలర్ చిత్రం దేశోద్ధారకులు రిలీజ్ అయ్యింది మార్చ్ 29 …అలాగే ఈ రోజు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా…అలాగే నా మొదటి చిత్రం తాతమ్మ కల ఇదే రామ కృష్ణ స్టూడియోస్ ప్రాంగణంలో మొదలయ్యింది…ఇప్పుడు నాన్నగారి జీవిత చరిత్రలో నేను ఆయన పాత్ర చేస్తూ ఇదే ప్రాంగణం లో ప్రారంభించబడటం అన్నది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను..- బాలయ్య

నాకు చాలా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే కచ్చితంగా, మనస్ఫూర్తిగా యన్.టి.ఆర్ ఇష్టం అని చెప్తాను ఎందుకంటే సాంగికమైనా, పౌరాణికమైనా ఆయన నటించలేని పాత్రలేదు ఏమో అనిపిస్తుంది-జమున

 
 
రామారావు గారికి పెద్ద ఫ్యాన్ నేను..బయోపిక్ డైరెక్ట్ చేయాలి అంటే నేను కరెక్ట్ కాదేమో అనుకున్నా.. నేనే కరెక్ట్ అని నన్ను తీసుకొచ్చారు…ఇచ్చిన అవకాశాన్నినిరూపించుకుంటా.. తప్పులు ఏమైనా ఉంటె క్షమించండి. అదృష్టం ఉంటె కానీ ఇలాంటి అవకాశం రాదు.. ఇది కథ కాదు చరిత్ర…ఆరు సినిమాల కథ ఒకే దానిలో తీయలేమో అందుకే టైం పడుతుంది…దసరాకి రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాము-తేజ

 
 
నేను పుట్టి పెరిగింది చెన్నై లో యమ్.జి.ఆర్ ని కలవలేదు…కానీ యన్.టి.ఆర్ గారి తో కలిసి భోజనం చేసే మహాభాగ్యం కలిగింది…అలాంటి ఒక లెజెండ్ బయోపిక్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కి తెలియాలి వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ..ఆయన రోల్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ హీరో బాలకృష్ణ గారు…ఆయన ఎనర్జీ ఎవరికీ ఉండదు.. ఏ పనైనా తప్పస్సు గా చేస్తాడు -హీరో రాజశేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here