రామ్ చ‌ర‌ణ్ ను చూడాల‌న‌కుంటున్నారా..?

RAM CHARAN ADS HAPPY MOBILES
ఒక్క హిట్ ప‌డ‌గానే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ రేంజ్ మారిపోయింది. ఈయ‌న కోసం ఇప్పుడు ద‌ర్శ‌కులు.. నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్పుడు యాడ్ వ‌రల్డ్ లో కూడా సంచ‌ల‌నాలు చేయ‌డానికి వ‌స్తున్నాడు చ‌ర‌ణ్. అప్ప‌ట్లో కొన్ని యాడ్స్ చేసినా ఆ త‌ర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయాడు చ‌ర‌ణ్. ఎక్కువ‌గా త‌న దృష్టిని సినిమాల‌పై పెట్టాడు. ఇక ఇప్పుడు రంగ‌స్థ‌లం త‌ర్వాత మ‌నోడి రేంజ్ మ‌ళ్లీ పెరిగిపోయింది.
దాంతో ఎండోర్స్ మెంట్ కోసం చ‌ర‌ణ్ వెంట ప‌డుతున్నారు. తాజాగా ఓ మొబైల్ యాడ్ కు సైన్ కూడా చేసాడు చ‌ర‌ణ్. అదే హ్యాపీ మొబైల్స్. దీనికి చ‌ర‌ణ్ బ్రాండింగ్ చేయ‌బో తున్నాడు. ఇక ఆ కంపెనీ కూడా చ‌ర‌ణ్ ఇమేజ్ ను వాడుకోడానికి ఆర్ యూ వాంట్ టూ సి అంటూ రామ్ చ‌ర‌ణ్ లోని రెండు అక్ష‌రాల‌ను హైలైట్ చేస్తున్నారు.
త్వ‌ర‌లోనే పెద్ద పెద్ద హోర్డింగులు కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాయి. ప్ర‌స్తుతానికి టాలీవుడ్ లో మ‌హేశ్ ను మించిన తోపులు ఎవ‌రూ లేరు. ఇప్పుడు బ‌న్నీ, ఎన్టీఆర్ ఉన్నా ఆయ‌నే నెం.1. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు చ‌ర‌ణ్ రేస్ లోకి వ‌స్తున్నాడు.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here