రామ్ లుక్కు మారిందే.. మ‌రి ఫేట్..?


హ‌లో గురూ ప్రేమకోస‌మే.. టైటిల్ లోనే కావాల్సినంత రొమాన్స్ ఉంది. పైగా పాజిటివ్ బ‌జ్ కూడా ఉంది. ఇప్పుడు రామ్ హీరోగా న‌టిస్తున్న సినిమాకు ఇదే టైటిల్ పెట్టారు. త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ చిత్ర షూటింగ్ మొద‌లై కూడా చాలా రోజులైంది. ఇక ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది. మే 14న రామ్ పుట్టిన‌రోజు కానుక‌గా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇన్నాళ్లూ ఒకే లుక్ లో క‌నిపిస్తూ వ‌చ్చిన రామ్.. తొలి సారి లుక్ మార్చేసాడు. మీసాలు పెట్టి.. గ‌డ్డం లైట్ గా పెట్టి.. కొంచెం స‌న్న‌బ‌డి.. చాలా కూల్ గా కనిపిస్తున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఉన్న‌ది ఒకటే జింద‌గీ ఫ్లాప్ అయినా కూడా మ‌రోసారి ఈమెతోనే రొమాన్స్ చేస్తున్నాడు రామ్. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా సినిమా చూపిస్తా మావా.. నేనులోక‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత త్రినాథ‌రావ్ నుంచి వ‌స్తోన్న సినిమా ఇది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా రామ్ కోరుకున్న విజ‌యం వ‌స్తుందో రాదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here