రివ్యూ: జ‌ంబ ల‌కిడి పంబ‌

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

రివ్యూ           : జ‌ంబ ల‌కిడి పంబ‌
న‌టీన‌టులు     : శ్రీ‌నివాస‌రెడ్డి, సిద్ధి ఇర్నాని, పోసాని, వెన్నెల కిషోర్, త‌ణికెళ్ల భ‌ర‌ణి..
సినిమాటోగ్ర‌ఫీ   : స‌తీష్ ముత్యాల‌
ఎడిటింగ్        : త‌మ్మిరాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: జేబి ముర‌ళి కృష్ణ‌

తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్ కామెడీ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ముందు వ‌ర‌స‌లో ఉండే సినిమా జ‌ంబ ల‌కిడి పంబ‌. ఇప్పుడు చూసినా కూడా న‌వ్వు ఆపుకోలేని సినిమా అది. అలాంటి సినిమాను ముట్టుకోడానికి కూడా చాలా మంది భ‌య‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు శ్రీ‌నివాస‌రెడ్డి చేసాడు. మ‌రి ఈ జ‌ంబ ల‌కిడి పంబ చిత్రం ఎలా ఉంది..? అప్ప‌ట్లా ఇప్పుడు కూడా జ‌ంబ ల‌కిడి పంబ మెప్పించిందా..?

క‌థ‌:
వ‌రుణ్ (శ్రీ‌నివాస‌రెడ్డి) ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. ఆయ‌న భార్య‌ ప‌ల్ల‌వి (సిద్ధి). ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్. ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అభిప్రాయ బేధాల‌తో కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. కలిసి ఉండ‌లేం అని డిసైడ్ చేసుకుని విడాకుల కోసం అప్లై చేస్తారు. వాళ్ల విడాకుల కేస్ లాయ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్(పోసాని) ద‌గ్గ‌రికి వ‌స్తుంది. అంత‌లోనే ఆయ‌న చ‌నిపోతాడు. పైన స్వ‌ర్గంలో లాయ‌ర్ కు ద్వారాలు తెరుచుకోవాలంటే కింద విడిపోయే జంట‌ను కల‌పాల‌ని దేవుడు కండీష‌న్ పెడ‌తాడు. మ‌రి వాళ్ల‌ను ఈ ఆత్మ క‌లుపుతుందా..? ఎలా కలిపాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
జంబ‌ల‌కిడిపంబ‌.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు ఇవివి గారే గుర్తొస్తారు. ఆల్ టైమ్ క్లాసిక్ కామెడీ సినిమా అది. దాన్ని ముట్టుకోడానికి అల్లరి న‌రేష్ కూడా భ‌య‌ప‌డ్డాడు. కానీ శ్రీ‌నివాసరెడ్డి ఆ ధైర్యం చేసాడు.. కానీ ధైర్యం చేసినంత ఈజీ కాదు క‌దా ప్రేక్ష‌కుల‌ను ఒప్పించ‌డం. ఆడ‌వాళ్లు మ‌గ‌.. మ‌గ‌వాళ్లు ఆడ‌గా మార‌డం ఒక్క‌టే జంబ‌ల‌కిడిపంబ కాదు. అందులో ఇవివి స‌త్య‌నారాయ‌ణ గారు ఇంకా చాలా చేసారు. అవ‌న్నీ క‌డుపులు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించి.. క్లాసిక్ గా నిలిచింది ఆ జంబ‌ల‌కిడిపంబ‌.

ఇప్పుడు టైటిల్ మాత్ర‌మే వాడుకుని.. క‌థ‌ను కంగాళి చేసారు. ఎటు పోతుందో తెలియ‌ని క‌థ‌లో శ్రీ‌నివాస‌రెడ్డితో పాటు అంతా కిచిడి అయిపోయారు. ముఖ్యంగా శ్రీ‌నివాస‌రెడ్డిని అమ్మాయిగా మారిన త‌ర్వాత‌ చూడ‌టం చాలా క‌ష్టం. జెండ‌ర్స్ ఎక్స్ చేంజ్ కాన్సెప్ట్ ఉంది కాబ‌ట్టి జంబ‌ల‌కిడిపంబ పెట్టేసారు. కానీ ఆ సినిమాలో క‌నీసం పావు వంతు కూడా ఇది న‌వ్వించ‌లేకపోయింది.
ఫ‌స్టాఫ్ ఏదో భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌తో సా..గిపోయినా.. జెండ‌ర్స్ మారిన త‌ర్వాత వెగ‌టు పుట్టించేలా ఉంది కామెడీ.

ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో శ్రీ‌నివాస రెడ్డితో చేయించిన కామెడీ చూడ‌లేని విధంగా ఉంది. అమ్మాయిగా ఆయ‌న ఓవ‌రాక్ష‌న్ చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి ఆ అమ్మాయి అలా ఉండ‌దు. టామ్ బాయ్ కావ‌డంతో జెండ‌ర్ మారిన త‌ర్వాత కూడా అమ్మాయి అలాగే అనిపిస్తుంది. కానీ హీరో కామెడీ గాడి త‌ప్పేస్తుంది. క్లైమాక్స్ వ‌ర‌కు శ్రీ‌నివాస‌రెడ్డిని జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ తో చూడ‌లేక ప్రేక్ష‌కుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. చ‌చ్చిపోయిన లాయ‌ర్ కు స్వ‌ర్గంలో భార్య ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే విడిపోయే వీళ్లిద్ద‌ర్ని క‌లిపాలి అని దేవుడు కండీష‌న్ పెట్ట‌డం వింత‌గా అనిపించినా.. దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం అస్స‌లు ఆక‌ట్టుకోలేదు. దాంతో జ‌ంబ ల‌కిడి పంబ కాస్తా పంబ జంబ లంబ ల‌కిడి అయిపోయింది.

న‌టీన‌టులు:
శ్రీ‌నివాస‌రెడ్డి కమెడియ‌న్ గా ఇప్ప‌టికే పాపుల‌ర్. ఆయ‌న కామెడీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ మాత్రం ఈయ‌న‌కు అస్స‌లు సూట్ కాలేదు. అమ్మాయి వేశంలో అస‌లు శ్రీ‌నివాస‌రెడ్డిని చూడ‌టం కూడా వెగ‌టుగా అనిపిస్తుంది. కొత్త హీరోయిన్ సిద్ధి బానే చేసింది. ఈమె జెండర్ మారిన త‌ర్వాత కూడా తేడా అనిపించ‌దు. పోసాని లాయ‌ర్ గా న‌వ్వులు పూయించాడు. అక్క‌డ‌క్క‌డా ఈయ‌నే కాస్త న‌వ్వు తెప్పించాడు. వెన్నెల కిషోర్ కూడా ప‌ర్లేదు. హ‌రితేజ‌.. త‌ణికెళ్ల.. ర‌ఘుబాబు వీళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం:
నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ సినిమాల‌కు సంగీతం అందించిన గోపీసుంద‌రేనా ఈ సినిమాకు కూడా సంగీతం అందించాడు అనిపిస్తుంది పాట‌లు వింటుంటే. ఒక్క‌టి కూడా పెద్దగా ఆక‌ట్టుకోలేదు. టైటిల్ సాంగ్ మాత్రం ప‌ర్లేద‌నిపిస్తుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఎందుకంటే అక్క‌డ చూపించ‌డానికి కూడా విజువ‌ల్స్ ఏం లేవు. ఎడిటింగ్ వీక్. రెండు గంట‌ల 21 నిమిషాల సినిమా బోర్ కొడుతుంది. మ‌ధ్య‌లో కొన్ని సీన్లు చిరాకు కూడా తెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమాకే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవ‌డం ముర‌ళీకృష్ణ చేసిన సాహ‌స‌మే అయినా.. దాన్ని డీల్ చేయ‌డంలో మాత్రం విఫ‌లం అయ్యాడు.

చివ‌ర‌గా:
జంబ‌ల‌కిడిపంబ‌.. కామెడీ కాదు.. కిచిడి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here