CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
నటీనటులు : అల్లుఅర్జున్, అను ఎమ్మాన్యువల్, శరత్ కుమార్, అర్జున్, నదియా
నిర్మాతలు : లగడపాటి శ్రీధర్, నాగబాబు
సంగీతం : విశాల్ శేఖర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు : వక్కంతం వంశీ
దర్శకుడికి తొలి సినిమా అంటే ఆ కల ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి దర్శకుడికి బన్నీ లాంటి స్టార్ దొరకడం చాలా కష్టం. కానీ వక్కంతం వంశీకి అన్నీ దొరికాయి. మరి ఈయన తొలి ప్రయత్నం ఎలా ఉంది..? బన్నీ పెట్టుకున్న నమ్మకాన్ని నా పేరు సూర్యతో తీర్చాడా..?
కథ:
సూర్య(అల్లుఅర్జున్) ఆర్మీలో ఉంటాడు. ప్రతీ చిన్న విషయానాకి కోపం ఎక్కువ. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఓ టెర్రరిస్ట్ ను హైయ్యర్ ఆఫీసర్స్ పర్మిషన్ లేకుండానే చంపేస్తాడు. దాంతో సూర్యను ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తాడు కల్నల్(బోమన్ ఇరాని). మళ్లీ ఆర్మీలోకి రావడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. చివరికి తన గాడ్ ఫాదర్ (రావు రమేష్) వెళ్లి కల్నల్ తో మాట్లాడతాడు. కానీ ఆయన సూర్యకు ఓ కండీషన్ పెడతాడు.
అది పూర్తి చేస్తే కానీ మళ్లీ ఆర్మీలోకి రాలేవని చెబుతాడు. దాంతో ఆ పని మీద వెళ్లిన సూర్యకు సైక్రియార్టిస్ట్ రామకృష్ణంరాజు(అర్జున్) దగ్గర ఇరుక్కు పోతాడు. అదే సమయంలో వైజాగ్ వచ్చిన సూర్యకు చల్లా(శరత్ కుమార్) తో గొడవ మొదలవుతుంది. మరి ఈయన లక్ష్యం పూర్తి చేసాడు.. తిరిగి ఆర్మీలో చేరాడా.. అసలు ఈ రామకృష్ణంరాజు ఎవరు.. ఇవన్నీ మిగిలిన కథ..
కథనం:
దేశాన్ని ప్రేమించడం.. గౌరవించడం ప్రతీ ఒక్కరూ చేస్తుంటారు.. కానీ దేశం కోసం ప్రాణాలిచ్చేది మాత్రం ఒక్క సైనికుడే. అది వాళ్ళకు దొరికిన వరంగా భావిస్తారు. దేశం కోసం ప్రాణాలివ్వడాన్ని కూడా వాళ్లు బాధ్యతగా భావించరు. దేశంపై వాళ్లకున్న ఎనలేని ప్రేమ అనాలేమో దాన్ని..
అలాంటి ఓ కథనే రాసుకున్నాడు వక్కంతం వంశీ. రాసుకున్న కథ హానెస్ట్ గానే ఉంది.. కానీ తీసిన విధానం మాత్రం మరోలా అనిపించింది. ఎంత జన్యూన్ గా రాసుకున్నాడో.. అంత జెన్యూనిటీ స్క్రీన్ పై కనిపించలేదు. హీరో కారెక్టరైజేషన్ ఎంత వద్దనుకున్నా అర్జున్ రెడ్డిని గుర్తుకు చేస్తుంది.
ఇలాంటి సినిమాల్లో కామెడీలు.. పాటలు.. ఎంటర్ టైన్మెంట్ ఊహించడం కష్టమే. కానీ బన్నీ స్టార్ హీరో కాబట్టి అవన్నీ కావాలనుకున్నాడు వక్కంతం వంశీ. తాను చెప్పాలనుకున్న కథ మధ్యలో కమర్షియల్ ట్రాక్ లో పడి.. కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోయిందేమో అనిపించింది అక్కడ క్కడా కొన్ని సీన్స్ చూస్తుంటే. కొన్ని సీన్లు బలంగా రాసుకున్నాడు.. భలే ఉన్నాయే అనుకునేంత సేపు పట్టదు..
వాటిపై ఇంప్రెషన్ పోవడానికి.. ఇది కూడా రొటీన్ సినిమాయే అనిపించడానికి. హీరో ఇంట్రడక్షన్ కు ఓ ఫైట్.. ఇంటర్వెల్ కు ముందు ఓ ఫైట్.. ఇలా ఓ టెంప్లేట్ ప్రకారమే వెళ్లిపోయాడు ఈ సూర్య. తొలి 20 నిమిషాల సినిమా ఉన్న స్పీడ్.. తర్వాత కూడా కంటిన్యూ అయ్యుంటే బాగుండేది. హీరో మిలటరీ వదిలేసాక.. దర్శకుడు కూడా కథను వదిలేసాడేమో అనిపిస్తుంది. అక్కడక్కడా పేలే ఒకట్రెండు సీన్స్ మినహాయిస్తే సూర్య ప్రతాపం మాత్రం చూపించలేదు..
క్లైమాక్స్ లో మాత్రం అందరిలో ఉన్న దేశభక్తితో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. వక్కంతం వంశీ హానెస్ట్ కథే రాసుకున్నాడు.. కానీ తీసిన విధానం ఆకట్టుకోలేదు. కామెడీతో పాటు చిరాకు పుట్టించే రొమాన్స్ సినిమాపై ఒపీనియన్ మార్చేస్తుంది. ఫస్టాఫ్ లో హీరో లవ్ ట్రాక్ అంతా సిల్లీగా అనిపిస్తుంది. సెకండాఫ్ లో సాయికుమార్ సీక్వెన్స్ ను ఇంకా హై రేంజ్ లో ఊహిస్తాం కానీ దాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ ను దేశభక్తితో ముగించి తన కథను జస్టిఫై చేసాడు దర్శకుడు.
నటీనటులు:
అల్లుఅర్జున్ దర్శకున్ని బాగా నమ్మాడు. ఆయన ఏం చెబితే అది చేసాడు. అందుకోసమే లుక్ తో పాటు బాడీలోకి సైనికుడిని కూడా బాగానే ఎక్కించుకున్నాడు. పూర్తిగా కొత్తగా కనిపించాడు. కానీ ఎందుకో అక్కడక్కడా బన్నీ ఈ పాత్రకు సరిపోలేదేమో అనిపిస్తుంది. అన్ ఈజీగా మూవ్ అయ్యాడు ఇందులో.
ఇక అను ఎమ్మాన్యువల్ కు చెప్పుకోడానికి ఏమీ లేదు పాటలు తప్ప. అర్జున్ డిఫెరెంట్ గా ట్రై చేసాడు. ఆయన పాత్ర కొత్తగా ఉంది. శరత్ కుమార్ విలన్ గా పెద్దగా ఆకట్టుకోలేదు. నదియా, రావు రమేష్, పోసాని పాత్రలు అలా వచ్చెళ్ళిపోతాయంతే.
టెక్నికల్ టీం:
విశాల్ శేఖర్ మ్యూజిక్ కొత్తగా ఏం అనిపించలేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సైనికా పాట విజువల్ గా అదిరిపోయింది. దేశం కోసం సైనికులు పడే కష్టం ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటివ్ వీక్ గా అనిపించింది.
చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక దర్శకుడిగా వక్కంతం అనుకున్న ముద్ర వేయలేకపోయాడు. కానీ రచయితగా మాత్రం ఆకట్టుకున్నాడు. కొన్ని మాటలు అద్భుతంగా రాసాడు. ఓవరాల్ గా నా పేరు సూర్య ఈయనకు డ్రీమ్ డెబ్యూ అయితే కాదు.
చివరగా:
నా పేరు సూర్య.. యాంగర్ తో డేంజర్..