రివ్యూ: మెహ‌బూబా

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

రివ్యూ                      : మెహ‌బూబా
న‌టీన‌టులు                : ఆకాశ్ పూరీ, నేహాశెట్టి, సాయాజీషిండే, ముర‌ళి శ‌ర్మ త‌దిత‌రులు
సంగీతం                    : స‌ందీప్ చౌతా
సినిమాటోగ్ర‌ఫీ              : విష్ణు వ‌ర్మ‌
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు  : పూరీ జ‌గ‌న్నాథ్
నిర్మాత‌                    : పూరీ క‌నెక్ట్స్
ఇండోపాక్ వార్ అంటేనే ఏదో తెలియ‌ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఉంటాయి. రెండు దేశాల మ‌ధ్య ఉన్న అంశం ఏదైనా చూడ్డానికి చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కానీ దాన్ని తెర‌కెక్కించే విధానం కూడా ఇలాగే ఉండాలి. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా మెహ‌బూబా అంటూ త‌న కొడుకును లాంఛ్ చేయ‌డానికి ఇండో పాక్ క‌థే తీసుకున్నాడు. మ‌రి ఇదెలా ఉంది..? మెహ‌బూబాతో పూరీ ఈజ్ బ్యాక్ అనిపించాడా..?
క‌థ‌:
రోష‌న్ (ఆకాశ్) చ‌దువు పూర్తి చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆర్మీకి సెలెక్ట్ అయి దేశానికి సేవ చేయాల‌నేది రోష‌న్ క‌ల‌. అయితే ఈ కుర్రాడికి చిన్న‌ప్ప‌ట్నుంచీ ఒకే క‌ల వ‌స్తుంటుంది. ఆ క‌ల్లో ఓ అమ్మాయి కోసం తాను చ‌చ్చిపోతున్న‌ట్లు అనిపిస్తుంటుంది.
అచ్చంగా ఇదే క‌ల‌లు పాకిస్థాన్ లో ఉండే ఆఫ్రీన్ (నేహాశెట్టి) కు కూడా వ‌స్తుంటాయి. ఈ ఇద్ద‌రూ గ‌త‌జ‌న్మ‌లో ప్రేమించుకుంటారు కానీ క‌లుసుకోకుండానే చ‌నిపోతారు. ఆ త‌ర్వాత ఓ రోజు హిమాల‌యాల‌కు స్నేహితుల‌తో క‌లిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన‌పుడు అక్క‌డ అదే అమ్మాయి శ‌వం చూస్తాడు రోష‌న్. అది త‌ను కాపాడిన ఆఫ్రీన్ ది కావ‌డంతో షాక్ అవుతాడు. కానీ దాని వెన‌క గ‌త జ‌న్మ ర‌హ‌స్యం ఉంటుంది. అదేంట‌నేది అస‌లు క‌థ‌..
క‌థ‌నం:
పూరీ మారిపోయాడ్రా బుజ్జా.. కొడుకు కోసం కొత్త‌గా ఏదో చేస్తున్నాడు. మెహ‌బూబా ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత చాలా మందికి అనిపించిన ఫీలింగ్ ఇదే. సినిమా ఫ‌స్టాఫ్ అయిపోయిన త‌ర్వాత ఇదే అభిప్రాయం మీద ఉన్నారు కొంద‌రు. నిజంగానే పూరీలో మార్పు వ‌చ్చిందేమో అనుకున్నారు. కానీ అస‌లు క‌థ అప్పుడే మొద‌లవుతుంది. పూరీ ఈజ్ బ్యాక్ అనుకున్నంత సేపు ప‌ట్ట‌లేదు..
పూరీ నిజంగానే బ్యాక్ అయ్యాడు అనిపించ‌డానికి. ఫ‌స్టాఫ్ ప‌ర్లేద‌నేలా తీసినా.. సెకండాఫ్ లో అస‌లు ఆట మొద‌లైంది.. ఇంట‌ర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ తో సెకండాఫ్ పై ఆస‌క్తి పెంచేసాడు. పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్.. ఇండోపాక్ వార్.. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి.. ఇన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఉన్నా పూరీ స‌క్సెస్ కాలేక‌పోయాడేమో అనిపించింది. కీల‌క‌మైన సెకండాఫ్ పూర్తిగా గాడి త‌ప్పింది. అప్ప‌ట్నుంచీ తాను తీసిందే సినిమా అన్న‌ట్లుగా సా……గిపోయింది. ఆస‌క్తి క‌లిగించే స‌న్నివేశాలు లేక‌.. హీరో హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ కుద‌ర‌క‌..
పోనీ యుద్ధ‌మైనా ఆస‌క్తి క‌లిగిస్తుందేమో అనుకుంటే అదీ నిల‌బ‌డ‌క‌.. ఎటూ కాకుండా పోయింది పూరీ మెహ‌బూబా. ఫ‌స్టాఫ్ లో దేశం గురించి సీన్స్.. ఇండో పాక్ మ‌ధ్య వ్య‌త్యాసం బాగానే చూపించినా.. సెకండాఫ్ కు వ‌చ్చేస‌రికి ఎందుకో పూర్తిగా ట్రాక్ త‌ప్పాడు పూరీ జ‌గ‌న్నాథ్. అక్క‌డ‌క్క‌డా పూరీ మార్క్ పెన్ ప‌వ‌ర్ క‌నిపించినా..
పూర్తిగా బ్యాక్ అనిపించ‌లేదు. యుద్ధం వాతావ‌ర‌ణంలో వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ రిచ్ గా అనిపించాయి కానీ.. ఇండో పాక్ వార్ అంటే ఎక్క‌డో ఉండాల్సిన ఎమోష‌న్ మిస్ అయింది.. అది ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఎంత‌సేపూ ప్రేమ‌ను చూపించాడు.. కానీ అది కూడా ప‌ర్ ఫెక్ట్ గా వ‌ర్క‌వుట్ కాలేదు. క్లైమాక్స్ ఏదో ఊహిస్తాం కానీ అది కూడా తేల్చేసాడు పూరీ.
న‌టీన‌టులు:
ఆకాశ్ పూరీ బాగా న‌టించాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ న‌టించ‌డం వ‌ల్లో ఏమో కానీ కెమెరా అంటే భ‌యం, బెరుకు రెండూ క‌నిపించ‌లేదు. బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సైనికుడిగా.. ప్రేమికుడిగా. కానీ క‌థ ఈయ‌న‌కు స‌హ‌క‌రించ‌లేదు. నేహాశెట్టి స‌ర్ ప్రైజ్ ప్యాకేజ్. చాలా బాగుంది.. అభిన‌యంతో స‌హా. ఇక హీరో తండ్రిగా సాయాజీ షిండే.. హీరోయిన్ తండ్రి పాకిస్థానీగా ముర‌ళీ శ‌ర్మ ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా కొత్త మొహాలే. అంతా క‌థ‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే కారెక్ట‌ర్స్.
టెక్నిక‌ల్ టీం:
సందీప్ చౌతా చాలా రోజుల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. రెండు పాట‌లు బాగున్నాయి. విజువ‌ల్ గా కూడా బాగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు పూరీ. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ లో చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. రిచ్ గా ఉంది ప్ర‌తీ విజువ‌ల్ కూడా.
పూరీ క‌నెక్ట్స్ నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. కొడుకే క‌దా అని బాగా ఖ‌ర్చు చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇక ద‌ర్శ‌కుడిగా ఆయ‌న మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే ర‌చ‌యిత‌గా మాత్రం అక్క‌డ‌క్క‌డా త‌న మార్క్ పంచులు చూపించాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే కొన్ని డైలాగ్స్ వింటేజ్ పూరీని చూపించాయి. ఓవ‌రాల్ గా డిఫెరెంట్ సినిమా చేసాడు కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్రం కాదు.
చివ‌ర‌గా:
ఆకాశ్ అదిరిపోయాడు.. పూరీ బెద‌ర‌గొట్టాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here