రివ్యూ: స‌మ్మోహ‌నం

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

రివ్యూ                       : స‌మ్మోహ‌నం
న‌టీన‌టులు                 : సుధీర్ బాబు, అదితిరావ్ హైద్రీ, న‌రేష్, ప‌విత్రా లోకేష్, రాహుల్ రామ‌కృష్ణ‌..
సినిమాటోగ్ర‌ఫీ               : పిజి విందా
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు   : ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌
సంగీతం                     : వివేక్ సాగ‌ర్
నిర్మాత‌                      : శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్

జెంటిల్ మ‌న్.. అమీతుమీ.. తెలియ‌కుండానే వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ. ఈయ‌న సినిమా అంటేనే ప్రేక్ష‌కుల్లో ఏదో తెలియ‌ని అంచ‌నాలు ఉంటాయి. ఇప్పుడు మ‌రోసారి స‌మ్మోహ‌నం అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ఇంద్ర‌గంటి. మ‌రి ఈ సారి ఏం చేసాడు..? అంచ‌నాలు నిల‌బెట్టుకున్నాడా..?

క‌థ‌:
విజ‌య్(సుధీర్ బాబు) బొమ్మలు వేస్తుంటాడు. చిన్న పిల్ల‌ల కోసం ఎలాగైనా ఓ బుక్ గీయాల‌నుకుంటాడు. అదే అత‌డి క‌ల‌. ఇక ఇంట్లో ఆయ‌న తండ్రి (న‌రేష్)కి సినిమాల పిచ్చి. ఆ పిచ్చితోనే తన ఇంట్లో షూటింగ్ చేసుకోమ్మ‌ని సినిమా వాళ్ల‌కు ఇచ్చేస్తాడు. అదే స‌మ‌యంలో స‌మీరా (అదితి) విజ‌య్ లైఫ్ లోకి వ‌స్తుంది. సినిమా వాళ్ళంటే పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని విజ‌య్.. స‌మీరాను ఇష్ట‌ప‌డ‌తాడు. వెళ్లి త‌న మ‌న‌సులో మాట చెబుతాడు. కానీ ఆమె నో అంటుంది. ఆ త‌ర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

కొన్నిసార్లు టైటిల్స్ చెబుతుంటాయి సినిమాలు ఎలా ఉంటాయి అనే సంగ‌తి. స‌మ్మోహ‌నం కూడా అలాంటి సినిమానే. టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇది చూసిన త‌ర్వాత ఓ మాయ‌లో మునిగిపోతాం. క‌థ కొత్త‌దేం కాదు.. కానీ తీసిన విధానం మాత్రం చాలా కొత్త‌ది. త‌న స్క్రీన్ ప్లేతో ఇంద్ర‌జాలం చేసాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. తెలిసిన సీన్లే స్క్రీన్ మీద క‌నిపిస్తున్నా తెలియ‌ని మైకం క‌లుగుతుంది. ఓ వైపు సుతిమెత్త‌గా ఇండ‌స్ట్రీని పోటు పొడుస్తూనే.. మ‌రోవైపు అదే చేత్తో తేనెను కూడా పూసాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ఈయ‌న లాంటి సెన్సిబుల్ డైరెక్ట‌ర్ నుంచి..

హార్డ్ హిట్టింగ్ డైలాగులు ఊహించ‌లేం.. కానీ ఊహించ‌న‌ది చేసి చూపించాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ఈ కుర్రాన్నే క‌దా ఐదేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అల‌వాటు చేయాల‌ని చూస్తున్నారంటూ.. నేరుగానే ఇండ‌స్ట్రీలో కొంద‌రు అప్ క‌మింగ్ హీరోల‌పై దిమ్మ‌తిరిగే పంచ్ వేసాడు ఇంద్ర‌గంటి. ఇలాంటి సీన్స్ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎలా ఉంటుంద‌నేది కూడా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు.

సినిమా ఇండ‌స్ట్రీ ఎంత గొప్ప‌దో చెబుతూనే.. చెత్త ప‌నులు కూడా చేస్తున్నారంటూ త‌న‌దైన శైలిలో చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. క‌థ ట్రాక్ త‌ప్ప‌కుండా.. హీరో హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ మెచ్యూర్డ్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ప్రేమ‌.. కోపం.. త్యాగం.. కెరీర్ లో ఆటుపోట్లు.. అపార్థాలు.. అన్నీ చ‌క్క‌గా తెర‌పై ఆవిష్క‌రించాడు. ఫ‌స్టాఫ్ అంతా కామెడీగా సాగిపోయినా.. సెకండాఫ్ లో ఎమోష‌న‌ల్ జ‌ర్నీ బాగుంది. అక్క‌డ‌క్క‌డా కాస్త నెమ్మ‌దిగా సాగినా.. ఓవ‌రాల్ గా స‌మ్మోహ‌నం చ‌క్క‌టి ఎక్స్ పీరియ‌న్స్. క్లైమాక్స్ వ‌ర‌కు ఎక్క‌డా గాడి త‌ప్ప‌కుండా క‌థ‌ను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. స్క్రీన్ ప్లే మాయాజాలంతో స‌మ్మోహ‌నప‌రిచాడు.

న‌టీన‌టులు:

సుధీర్ బాబు సెటిల్డ్ గా న‌టించాడు.. కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇది. ఇక అదితిరావ్ హైద్రీ మాయ చేసింది.. చూస్తుంటే అలా చూడాల‌నిపించేలా ఉంది ఆ అమ్మాయి. న‌ట‌న‌తో పాటు సొంత డ‌బ్బింగ్ తో మాయ చేసింది.. ఇన్నాళ్లూ ఈ హీరోయిన్ ను తెలుగు ద‌ర్శ‌కులు ఎందుకు వ‌దిలేసామా అని ఫీల్ అవుతారు ఈ చిత్రం చూసిన త‌ర్వాత‌. అంత బాగా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక న‌రేష్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మాయ చేసారు. న‌వ్వించారు.. ఏడిపించారు కూడా. ప‌విత్ర లోకేష్ హీరో త‌ల్లిగా చాలా బాగా చేసింది. ఫ్రెండ్స్ గా రాహుల్ రామ‌కృష్ణతో పాటు పెళ్లి చూపులు ఫేమ్ మ‌రో అబ్బాయి కూడా బాగా న‌టించాడు.

టెక్నిక‌ల్ టీం:

స‌మ్మోహ‌నంలో స‌గం విజ‌యం సినిమాటోగ్ర‌ఫ‌ర్ పిజి విందాకే వెళ్తుంది. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మెయిన్ హైలైట్. పెళ్లిచూపులు ఫేమ్ వివేక్ సాగ‌ర్ ఆర్ఆర్ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మ‌రోసారి త‌న స్పెషాలిటీ చూపించాడు. తెలిసిన స‌న్నివేశాల‌ను అందంగా రాసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఈయ‌న తెర‌కెక్కించిన విధానం చూసి ఎవ‌రైనా ఫిదా అయిపోవాల్సిందే. అద్భుతమైన టేకింగ్ తో మాయ చేసాడు. కాక‌పోతే కాస్త నెమ్మ‌దిగా సాగ‌డం ఒక్క‌టే ఈ చిత్రానికి మైన‌స్.

చివ‌ర‌గా:
స‌మ్మోహ‌నం.. టైటిల్ కు త‌గ్గ‌ట్లే స‌మ్మోహ‌న‌మే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here