రేణు దేశాయ్ ఎన్టీఆర్ గురించి ఏమన్నారంటే?

what renu desai said about ntr?

రేణు దేశాయ్ టీవిలో ‘నీతోనే డ్యాన్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. ఇది డ్యాన్స్ షో కావడంతో హీరోలలో ఎవరు ఉత్తమ డ్యాన్సర్ అనే ప్రశ్న తలెత్తగా. రేణు తన మాజీ భర్త అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా, ఎన్టీఆర్ ఉత్తమ డ్యాన్సర్ అని చెప్పడం విశేషం.

కార్యక్రమంలో పాల్గొన్న ఓ జంట యంగ్ టైగర్ పాటకు స్టెప్పులేయగా, తన జడ్జిమెంట్ చెప్పే క్రమంలో రేణు…ఎన్టీఆర్ ఓ గొప్ప డ్యాన్సర్ అని, తెలుగు చిత్ర సీమలో ఆయనే బెస్ట్ అని, ఎంతటి కష్టమైనా స్టెప్పులైనా ఈజీ గాను, స్టైలిష్ గాను వేయడం లో ఆయనకు ఆయనే సాటి అని మెచ్చుకున్నారు రేణు. అంతే కాకుండా రేణు పెద్ద ఎన్టీఆర్ ను కూడా తలచు కున్నారు, పౌరాణిక పాత్రలంటే ఎన్టీఆర్ కు ఎవరు సాటి రారని చెప్పారు. రేణు మాటలకూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు