రేపే విడుదల కాబోతున్న ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ” ప్రేమతో మీ కార్తీక్ “

Prematho Mee Karthik Pre Release Event Photos
మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు. సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఈచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత స‌క్స‌స్ కి చిరునామాగా మారిన దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్ టీజర్స్, ట్రైలర్స్ కి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా
ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ప్రేమతో మీ కార్తీక్ నవంబర్ 17న విడుదల అవుతుంది. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ ఇలా కొత్తవారందరూ ఈ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సినిమా కూడా చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జిమికి కమల్ సాంగ్ ని కంపోజ్ చేసిన షాన్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతదర్శకునిగా వ్యహరించారు. నవంబర్ 17న విడుదల కాబోతున్న ప్రేమతో మీ కార్తీక్ ప్రేక్షకుల్ని అలరిస్తోందని ఆశిస్తున్నాను అని అన్నారు.
డైన‌మిక్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ.. ప్రేమ‌తో మీ కార్తిక్ చిత్రం ట్రైల‌ర్ , సాంగ్స్ చూశాను చాలా బాగున్నాయి. ద‌ర్శ‌కుడు రిషి చాలా క‌ష్ట‌ప‌డి ఇష్టం తో చేశాడు. హీరో కార్తిక్‌, సిమ్రాత్ లు చాలా అందంగా క‌నిపిస్తున్నారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తీసారు. సినిమా అంత‌బాగుంది కాబ‌ట్టే స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు
కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి
సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషి.