రేస్ మొద‌లుపెట్టిన నాగ‌శౌర్య‌.. 

Naga-Shaurya-Chalo-grand-release-on-Feb-2,naga shaurya,chalo,naga shaurya chalo release on feb2,

తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చాడు నాగ‌శౌర్య‌. ఊహ‌లు గుసగుస‌లాడే.. దిక్కులు చూడ‌కు రామ‌య్యా.. జో అచ్చుతానంద‌.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలున్నాయి ఈ హీరో కెరీర్ లో. కానీ ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు నాగ‌శౌర్య ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌థ‌లో రాజ‌కుమారి కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా కానీ నాగ‌శౌర్య కెరీర్ ప్ర‌స్తుతం సంతృప్తి క‌రంగానే సాగుతుంది. ఇప్పుడు ఈ హీరో రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న ఛ‌లోతో పాటు ఏఎల్ విజ‌య్ తో చేస్తున్న క‌ణం కూడా వారం రోజుల గ్యాప్ లో విడుద‌ల కానున్నాయి.
ఛ‌లో క‌థ త‌మిళ‌నాడు నేప‌థ్యంలో సాగ‌నుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన సాంగ్.. టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని ముందు డిసెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ పోటీ కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 2కి వాయిదా వేసారు. ఈ చిత్రంతో పాటు క‌ణంలోనూ న‌టిస్తున్నాడు నాగ‌శౌర్య‌. లేటెస్ట్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వితో క‌లిసి క‌ణంలో న‌టిస్తున్నాడు నాగ‌శౌర్య‌. ఏఎల్ విజ‌య్ దీనికి ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి ఎంట్రీతో సినిమా రేంజ్ పెరిగింది. ఫిబ్ర‌వరి 9న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అంటే వారం రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాలతో రానున్నాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి ఈ రెండు సినిమాల‌తో త‌న కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంద‌ని భావిస్తున్నాడు నాగ‌శౌర్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here