రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అలకానంద

కార్తికేయ మిరియాల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి. బి . ఆర్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ రావు నిర్మిస్తున్న చిత్రం   ” అలకానంద ” . భవికా దేశాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రవివర్మ హీరో కాగా తాగుబోతు రమేష్ , వెన్నెల కిషోర్ , విజయ్ సాయి , రఘు బాబు, నల్ల వేణు  ప్రధాన పాత్రలు పోషించారు . తెలుగు , తమిళ , హిందీ బాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మిస్తున్నారు . ఒక పాట , ఒక ఫైట్ బ్యాలెన్స్ మాత్రమే ఉన్న అలకానంద టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది .
ఈ సందర్భంగా దర్శకులు మిరియాల కార్తికేయ మాట్లాడుతూ ” యుత్ ని అలరించేలా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది . కథ చెప్పిన వెంటనే మూడు బాషలలో నిర్మించడానికి ముందుకు వచ్చి నాకు అవకాశం ఇచ్చిన ఈశ్వర్ రావు కు కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను . ఒక పాట , ఒక ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి వాటిని కూడా ఈనెలలోనే కంప్లీట్ చేస్తాం . ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు .
నిర్మాత ఈశ్వర్ రావు మాట్లాడుతూ ” సస్పెన్స్ తో కూడిన రొమాంటిక్ చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఈ చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చాను . అలాగే దర్శకుడు చెప్పిన దాని కంటే బాగా సినిమాని తీసాడు . ఆల్రెడీ రష్ చూసుకున్నాం , తప్పకుండా హిట్ కొడతామన్న ధీమా ఉందన్నారు .
శివ కాకాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సమి ఛాయాగ్రహణం అందిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here