రోజాకు పోటీగా మరో హీరోయిన్ ను బరిలోకి దింపనున్న టీడీపీ

తన వాగ్ధాటితో రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. టీడీపీ నాయకలు ఎంత మంది ఉన్న రోజా మాటల తూటాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. రోజా ఎంతటి వారినైనా అది సరాసరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా సరే నోటికి వచ్చినట్లు చెడామడా దులిపి పారేయడంలో సిద్ధహస్తురాలయ్యింది. మహిళా నాయకురాలు కావడంతో టీడీపీ నేతలు ఆచి తూచి జాగర్తగా ఎదురుదాడి చేస్తున్నారు తప్ప అవి రోజా విమర్శలకు సరి తూగడం లేదనే వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలో రోజా ను ఎదుర్కొనడానికి మరో హీరోయిన్ ను రంగం లో దింపనుంది టీడీపీ. అది మరెవరో కాదు, వాణి విశ్వనాధ్.

ఇటీవలే ‘జయ జానకి నాయక’ చిత్రం తో రీఎంట్రీ ఇచ్చిన వాణి లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో తమ అభిమాన నాయకుడిని తప్పుగా చూపిస్తే రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించి వార్తల్లోకి ఎక్కారు. టీడీపీ వాణి విశ్వనాధ్ కు నగరి టికెట్ ఇచ్చి రోజాకు పోటీ నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. వాణి విశ్వనాధ్ అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించి ఒక ఊపు ఊపారు. ఎన్టీఆర్ తో కూడా సామ్రాట్ అశోక్ అనే చిత్రంలో ఆడి పాడారు.