ర‌కుల్ టాలీవుడ్ పై అలా అనేసిందేంటి..?

Anchor Manjusha @ Rakul Preet Singh Photos
ఏ ఎండ‌కు ఆ గొడుగు.. ఈ సామెత అంద‌రికీ తెలిసే ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్ లో స్టైల్ గా రోమ్ లో ఉన్న‌పుడు రోమ‌న్ లా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ర‌కుల్ కూడా ఇదే చేస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న ర‌కుల్.. ఇప్పుడు కేరాఫ్ బాలీవుడ్ అయిపోయింది. అక్క‌డ వ‌ర‌స సినిమాలు చేస్తూ బిజీ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్న‌టి వ‌ర‌కు అయ్యారీ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న ఈ భామ‌.. ఇది ఫ్లాప్ అయిన త‌ర్వాత సింపుల్ గా మ‌ళ్లీ త‌మిళ ఇండ‌స్ట్రీకి వ‌చ్చేసింది. ఎవ‌ర్ని ఎప్పుడు ఎక్క‌డ ఎలా ప‌డ‌గొడితే ఏంటి లాభం అనే సంగతి రకుల్ కి బాగా తెలుసు. తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో వ‌ర‌స‌గా చిన్న హీరోల‌తో న‌టించింది ర‌కుల్. అప్పుడు త‌న అందాల గ‌దికి తాళం వేసుకుంది. ఎప్పుడైతే స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చిందో.. అప్పుడే అందాల గ‌దికి తాళం తీసింది. బ్రూస్ లీ, నాన్న‌కు ప్రేమ‌తో, స‌రైనోడు, ధృవ‌ లాంటి సినిమాల్లో బాగానే గ్లామ‌ర్ షో చేసింది ర‌కుల్ ప్రీత్.
ముంబై భామ కదా.. స్టార్స్ ను చూసే స‌రికి గ్లామ‌ర్ లెక్క‌ల‌న్నీ స‌రిచేయాల‌ని చూస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఇదే దారిలో వెళ్తుంది ర‌కుల్. అయ్యారీ హిట్ అయ్యుంటే త‌మిళ ఇండ‌స్ట్రీ వైపు కూడా చూసేది కాదేమో కానీ అది ఫ్లాప్ అయింది కాబ‌ట్టి త‌మిళ ఇండ‌స్ట్రీని స్టాండ్ బై గా పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం అక్క‌డ సూర్య‌తో ఎన్జికే.. కార్తితో ఓ సినిమా.. శివ‌కార్తికేయ‌న్ తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక హిందీలో అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా న‌టిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. మ‌రి తెలుగులో ఎందుకు న‌టించ‌ట్లేదంటే ఇక్క‌డ అవ‌కాశాలు వ‌స్తున్నా కూడా తానే కావాల‌ని తెలుగు ఇండ‌స్ట్రీని కొన్నాళ్లు ప‌క్క‌న‌బెట్టాల‌ని ఫిక్సైన‌ట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. అడిగితే ఊరికే అనేసింది. మ‌రి ఊరికే అలా ఎందుకు అనాల్సి వ‌చ్చిందో ర‌కుల్ కే తెలియాలి. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా త‌న‌పైనే కెమెరాల‌న్నీ ఫోక‌స్ అయ్యేలా అందాలు ఆర‌బోస్తూ రెచ్చ‌గొడుతుంది ఈ భామ‌. ర‌కుల్ ఎక్క‌డుంటే అక్క‌డ అందాల‌తో అక్క‌డి వేడుక మొత్తం హీట్ ఎక్కిపోయింది. మొత్తానికి స్టార్ ఇమేజ్ వ‌చ్చినా.. అది తెచ్చిన గ్లామ‌ర్ షో ను మాత్రం వ‌ద‌ల్లేదు ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here