ర‌కుల్ త‌మిళ్ లో మొద‌లెట్టిందిగా..!

ర‌కుల్ ప్రీత్ కు ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీ ప్రీతి పాత్రంగా మారిపోయింది. అంటే ఇష్టంగా అన్న‌మాట‌. ఇప్పుడు అక్క‌డే ఎక్కువ‌గా ఉంటుంది ఈ భామ‌. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి పూర్తిగా అవ‌కాశాలు దూరం అయ్యేస‌రికి అర‌వంలో పాగా వేయాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డ ఖాకీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వ‌ర‌స‌గా టాప్ హీరోల‌తో సినిమా చేస్తుంది. తాజాగా శివ‌కార్తికేయ‌న్ సినిమా మొద‌లుపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌.

జూన్ 27న ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో మొద‌లైంది. శివ‌తో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తుంది ర‌కుల్. సూర్య‌-సెల్వ సినిమాలో ర‌కుల్ ఓ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి ఉంది. ఇక కార్తితో మ‌రో సినిమాలోనూ రొమాన్స్ చేస్తుంది. దానికితోడు విశాల్ కూడా ర‌కుల్ ప్రీత్ పై క‌న్నేసాడు. ఈయన కూడా త‌న సినిమాలో హీరోయిన్ గా ర‌కుల్ ను తీసుకోవాల‌నుకుంటున్నాడు. తెలుగులో ఇప్పుడు ర‌కుల్ కు పూర్తిగా దారులు మూసుకుపోయిన‌ట్లే. కొత్త హీరోయిన్లు వ‌చ్చేయ‌డంతో ఇప్పుడు ర‌కుల్ పాత స‌రుకు అయిపోయింది.

దాంతో క‌నీసం ఐటం గాళ్ గా అయినా రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తుంది ర‌కుల్. కానీ ఆ ఛాన్స్ కూడా ఇప్పుడు వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. త‌న‌కు అచ్చొచ్చిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను.. క‌లిసొచ్చిన హీరో రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ఐటం సాంగ్ చేయ‌డానికి ర‌కుల్ రెడీ అవుతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఇది కూడా అబ‌ద్ధం అంటున్నారు చిత్ర‌యూనిట్. తాము ర‌కుల్ ను అస్స‌లు సంప్ర‌దించ‌లేదంటున్నారు. మ‌రి ఇలాంటి టైమ్ లో తెలుగులో ర‌కుల్ రీ ఎంట్రీకి స‌రైన ఎంట్రీ ఎప్పుడు దొరుకుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here