ర‌జినీకాంత్ కెరీర్ ముగిసిన‌ట్లేనా..? 

సూప‌ర్ స్టార్ ఇక‌పై మ‌న‌కు సినిమాల్లో క‌నిపించ‌డా..? 2018 ఆయ‌న న‌ట‌నకు చివ‌రి ఏడాదా..? ఇక‌పై ఆయ‌న స్టైల్ గా సిగ‌రెట్లు కాల్చ‌డం.. అలా న‌డిచి రావ‌డం మ‌న‌కు గ‌త చ‌రిత్రేనా..? ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇకపై ర‌జినీ నుంచి సినిమాలు ఊహించ‌డం క‌ష్ట‌మే. ఈయ‌న రాజ‌కీయాల్లో బిజీ కానున్నాడు. త్వ‌ర‌లోనే కొత్త పార్టీ కూడా స్థాపించ‌బోతున్నాడు. ఆ ప‌నుల‌పైనే ఫోక‌స్ పెట్టాడు ర‌జినీకాంత్. ప్ర‌స్తుతం న‌టిస్తున్న కాలా.. 2.0 త‌ర్వాత ర‌జినీ సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోనే కొన‌సాగ‌నున్నారు. 42 ఏళ్లుగా ఇండియ‌న్ సినిమాను ఏలుతున్న సూప‌ర్ స్టార్.. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుని.. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ కార్డ్ అందుకున్నారు. అందుకేనేమో ఒప్పుకున్న 2.0.. కాలా సినిమాలు వేగంగా పూర్తి చేసాడు ర‌జినీకాంత్.
ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల్లో త‌న వంతు పాత్ర పూర్తి చేసాడు ర‌జినీకాంత్. 2.0 అన్నీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రం త‌మిళ ఉగాది ఎప్రిల్ 14న విడుద‌ల కానుంది. ఇక ఇదొచ్చిన రెండు నెల‌ల‌కు కాలా రానుంద‌ని చెప్పాడు ర‌జినీ. రంజిత్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో రాజ‌కీయాల గురించి చాలానే డైలాగులు ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తుంది. ఇందులో అణిచివేయ‌బ‌డిన త‌మిళుల కోసం పోరాడే నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్. ఇది త‌న రాజ‌కీయ అరంగేట్రానికి యూజ్ అవుతుంద‌ని భావిస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఈ రెండు చిత్రాల త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా కూడా అనౌన్స్ చేయ‌లేదు ర‌జినీ. అంటే ఇక‌పై సినిమాల‌కు దూరంగా ఉండాల‌నే నిశ్చ‌యించుకున్నాడు మ‌న సూప‌ర్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here