ర‌జినీ ఇక్క‌డ‌.. ప్ర‌మోష‌న్ ఎందుకు..?

ఈ మ‌ధ్య మీడియా వాళ్ల‌కు కాస్త ఉత్సాహం ఎక్కువైపోతుంది. ఎవ‌రు క‌నిపించినా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లి బుక్ అయిపోతున్నారు. ఇప్పుడు ర‌జినీకాంత్ ముందు కూడా ఇలాగే బుక్ అయ్యాడు ఓ త‌మిళ జ‌ర్న‌లిస్ట్. పాపం.. ర‌జినీ క‌నిపించ‌గానే ముందు వెన‌క చూసుకోకుండా నోటికొచ్చిన ప్ర‌శ్న ఒక‌టి అడిగేసాడు. దాంతో అప్ప‌టి వ‌ర‌కు కామ్ గా ఉన్న ర‌జినీ.. కాస్త సెటైరిక‌ల్ గా స‌మాధానం ఇచ్చాడు.

అంత‌గా ర‌జినీని చిరాకు పెట్టిన ప్ర‌శ్న ఏంటో తెలుసా..? ఇన్నాళ్లూ రాకుండా ఇప్పుడు మీరు బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం కాలా ప్ర‌మోష‌న్ కోస‌మా అని..? ఈ మ‌ధ్యే తూత్తుకూడి వెళ్లి అక్క‌డ స‌మ‌స్యల గురించి అడిగి తెలుసుకున్నారు రజినీకాంత్. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతుంటే ఈ ప్ర‌మోష‌న్ ప్ర‌శ్న ర‌జినీ చెవిన ప‌డింది. దాంతో దిమ్మ‌తిరిగిపోయేలా స‌మాధానం ఇచ్చాడు ర‌జినీకాంత్. ఈ వయసులో త‌న‌కు ఈ రకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు.. త‌న‌కు చాలా అనుభవం ఉంది.. పైగా దేవుడి దయవల్ల ఇంకా అభిమానులు కూడా ఉన్నారు.

వాళ్ళు ఇప్ప‌టికీ త‌న సినిమాలు చూస్తున్నారు.. దాంతో త‌న‌కు ప్ర‌మోష‌న్ కోసం పాకులాడాల్సిన అవ‌స‌రం రాలేదంటూ మీడియాకు గ‌ట్టి స‌మాధాన‌మే ఇచ్చాడు సూప‌ర్ స్టార్. ఇది విన్న వాళ్ల‌కు బుర్ర‌లు కూడా గిర్రున తిరిగాయి. లేక‌పోతే మ‌రేంటి.. ర‌జినీకాంత్ సినిమా హిట్టైనా ఫ్లాపైనా ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ కోసం రావాల్సిన అవ‌స‌రం ఏంటి..? ఫ‌లితంతో సంబంధం లేని సూప‌ర్ స్టార్ ఆయ‌న‌. క‌నీసం ఆ మ‌ర్యాద అయినా ఇవ్వాలి క‌దా..? ఇవ్వ‌కుండా అడిగితే ఇలాంటి స‌మాధానాలే వ‌స్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here