ర‌జినీ-క‌మ‌ల్.. ఏం చేస్తున్నారు..?


ర‌జినీకాంత్.. క‌మ‌ల్ హాస‌న్.. ఈ ఇద్ద‌రి గురించి ఏమ‌ని చెప్పాలి..? ఇమేజ్ గురించి ఏమ‌ని మాట్లాడాలి..? ఒక్కొక్క‌రికీ 40 ఏళ్ల అనుభవం ఉంది. కోట్ల‌లో అభిమానులు ఉన్నారు. ఎప్ప‌ట్నుంచో ఇద్ద‌రూ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని చెప్తున్నారు.. ఇప్పుడు వ‌చ్చారు. ఓ వైపు క‌మ‌ల్ పార్టీ మొద‌లుపెట్టి త‌న ప‌ని చేస్తున్నాడు. మ‌రోవైపు ర‌జినీకాంత్ మాత్రం సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు.
జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఈ ఇద్ద‌రూ రాజ‌కీయాల్లోకి వ‌స్తే క‌చ్చితంగా ఏదో కొంత ప్ర‌భావం చూపిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వీళ్లు ప్ర‌భావం కాదు క‌దా.. క‌నీసం పార్టీలు కూడా ప్ర‌భావితం చేయ‌ట్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం క్యాడ‌ర్ లేకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తున్నారు.
ఎన్నిక‌ల‌కు ఏడాది టైమ్ కూడా లేదు.. ఇప్ప‌టికీ సినిమాలంటూ తిరిగేస్తున్నారు. ఈ ఇద్ద‌ర్నీ చూసి సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు కూడా జోక‌ర్లు అంటూ న‌వ్వుకుంటున్నారు. ఏదో మార్పు తీసుకొస్తారు అనుకుంటే.. ఇలా చేస్తున్నారు. వీళ్ల ప‌నులు చూసి అభిమానులు కూడా హ‌ర్ట్ అవుతున్నారు. వీళ్ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్న వాళ్ల‌కు కూడా ర‌జినీ, క‌మ‌ల్ త‌మ ప‌నుల‌తో కోపం తెప్పిస్తున్నారు. మ‌రి వీళ్లు ఎప్ప‌టికి రాజ‌కీయాల‌ను సినిమాలా కాకుండా సీరియ‌స్ గా తీసుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here