ర‌జినీ.. బ్యాక్ టూ చెన్నై..


హిమాల‌యాల‌కు ఎప్పుడు వెళ్లినా కూడా త‌క్కువ‌లో త‌క్కువ నెల రోజుల ఉండే ర‌జినీకాంత్.. ఈ సారి మాత్రం ఎందుకో కాస్త త్వ‌ర‌గానే వ‌చ్చేసాడు. ఈ మ‌ధ్యే హిమాల‌యాల‌కు వెళ్లిన ర‌జినీ.. ఇప్పుడు తిరిగి వ‌చ్చేసారు. రిషికేష్ లోనే ఈయ‌న కొన్ని రోజులు ఉన్నారు. అక్క‌డే ఆశ్ర‌మంలో ఉండి కొండ‌ల్లో.. గుట్ట‌ల్లో మామూలు వ్య‌క్తిలా తిరిగారు. కొన్ని రోజుల పాటు ప్ర‌పంచంతో ప‌నిలేకుండా ప్ర‌శాంతంగా గ‌డిపిన సూప‌ర్ స్టార్.. ఇప్పుడు తిరిగి చెన్నైకి వ‌చ్చేసారు. ఆయ‌న రాక తెలుసుకుని ఎయిర్ పోర్ట్ కు వేల సంఖ్య‌లో అభిమానులు చేరుకున్నారు. ఎంతోమంది అభిమానుల స‌మ‌క్షంలో సొంత ఇంటికి చేరుకున్నారు ర‌జినీకాంత్. వ‌చ్చీ రాగానే ఆయ‌న సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తారేమో అనుకుంటే.. రాజ‌కీయాలతో బిజీ అయ్యేలా క‌నిపిస్తున్నారు. మార్చ్ 14న త‌మిళ కొత్త ఏడాది కానుక‌గా కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌బోతున్నారు సూప‌ర్ స్టార్. అదేరోజు పార్టీ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌బోతున్నాడు ర‌జినీకాంత్. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ చెన్నైలో సంద‌డి చేస్తున్నాడు ర‌జినీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here