ర‌జినీ సినిమాకు అల్లుడి సంగీతం.. 


అదేంటి.. కొంప‌దీసి ధ‌నుష్ కానీ ర‌జినీకాంత్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? కాదండీ బాబు.. కానీ అల్లుడే ఇప్పుడు ర‌జినీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. వారం రోజుల కింది వ‌ర‌కు అస‌లు ర‌జినీకాంత్ సినిమాలు చేస్తాడా చేయ‌డా ఇక అనుకున్నారంతా. 2.0, కాలా త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోతాడ‌ని.. ఇక‌పై సినిమాలు చేయ‌డ‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న ప్లానింగ్ తో అంద‌రికీ పిచ్చెక్కిస్తున్నాడు. కుర్ర ద‌ర్శ‌కులంద‌ర్నీ పోగేసి వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు ర‌జినీకాంత్. మొన్న‌టికి మొన్న రంజిత్ తో కాలా సినిమా పూర్తి చేసిన ర‌జినీ.. ఇప్ప‌టికే శంక‌ర్ తో 2.0 పూర్తి చేసాడు. ఈ రెండు సినిమాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లోనే ఉన్నాయి. రెండూ త‌క్కువ గ్యాప్ లోనే విడుద‌ల కానున్నాయి.
ఇలాంటి టైమ్ లో మ‌రో సినిమాకు కూడా క‌మిట‌య్యాడు ర‌జినీకాంత్. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కుర్ర ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ తో సినిమా ఓకే చేసాడు సూప‌ర్ స్టార్. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో క‌ళానిధి మార‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. పిజ్జా సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్.. ఇప్పుడు ఏకంగా ర‌జినీతో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఈయ‌న స్వ‌యానా ర‌జినీ భార్య ల‌త‌కు అన్న‌య్య కొడుకు. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంత ఎత్తుకు చేరినా కూడా ర‌జినీతో మాత్రం ప‌ని చేయ‌లేదు. ఇప్పుడు ఆ ఆఫ‌ర్ వ‌చ్చింది. వ‌య‌సు 70కి చేరువ‌గా ఉన్న ఈ టైమ్ లో వ‌ర‌స‌గా కుర్రాళ్ల‌తో ప‌నిచేస్తూ వాళ్ల ఆలోచ‌న‌లు తీసుకుంటున్నాడు ర‌జినీకాంత్. ఈయ‌న జోరు చూస్తుంటే రాజ‌కీయాల్లో బిజీ అయినా.. సినిమాల విష‌యంలో రాజీ ప‌డేలా క‌నిపించ‌ట్లేదు. చూడాలిక‌.. ఈ సినిమాల దూకుడు ఎప్పుడు త‌గ్గ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here