ర‌జినీ సినిమాలో విల‌న్ గా విజ‌య్..


ర‌జినీకాంత్ సినిమాలో న‌టించాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర‌లో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా గాల్లో గంతేస్తుంటారు న‌టులు. ఇంత వ‌ర‌కు అంతా బాగానే ఉంది.. ర‌జినీ సినిమా కోసం విల‌న్లుగా మారిపోతున్నారు స్టార్ హీరోలు. అవ‌కాశాలు మెండుగా వ‌స్తున్నా.. వాళ్ల‌కు కూడా స‌ప‌రేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా..
మార్కెట్ ఉన్నా కేవ‌లం ర‌జినీకాంత్ కోసం వాళ్లు విల‌న్లుగా మారిపోతున్నారు. ఇదే ఇప్పుడు ఫ్యాష‌న్ అయిపోయింది. ఇప్ప‌టికే 2.0లో ర‌జినీకాంత్ కు ప్ర‌తినాయ‌కుడిగా అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నాడు. ఈయ‌న‌కు ఉన్న ఇమేజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో 200 కోట్ల మార్కెట్ ఉన్న హీరో అక్కీ.
అలాంటిది 2.0లో ర‌జినీకి అపోజిట్ గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ చేయ‌బోయే సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టించ‌బోతున్నాడు.
ఈయ‌న త‌మిళ‌నాట 30 కోట్ల‌కు పైగా మార్కెట్ ఉన్న హీరో. ఈయ‌న ఇప్పుడు ర‌జినీ కోసం ప్ర‌తినాయ‌కుడిగా మారుతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న తెలుగులో సైరా సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక ఇప్పుడు మ‌రో సూప‌ర్ స్టార్ తో న‌టించ‌బోతున్నాడు. ర‌జినీ సినిమాలో విజ‌య్ ఒప్పుకోడానికి కార‌ణం కూడా లేక‌పోలేదు.
కార్తిక్ సుబ్బ‌రాజ్.. విజ‌య్ సేతుప‌తి స్నేహితులు. విజ‌య్ సేతుప‌తికి హీరోగా బ్రేక్ ఇచ్చింది కార్తికే. పిజ్జా సినిమాతోనే ఈయ‌న స్టార్ అయ్యాడు. ఆ కృత‌జ్ఞత‌తోనే ఇప్పుడు విల‌న్ గా మారిపోతున్నాడు విజ‌య్ సేతుప‌తి. ర‌జినీకాంత్ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నాడు. ఆరోగ్య చికిత్స కోసం అక్క‌డున్నాడు. ఆయ‌న రాగానే జూన్ నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here